ASBL NSL Infratech

నేను అవకాశవాదిని కాదు.. అవకాశాలే నావద్దకు వచ్చాయి

నేను అవకాశవాదిని కాదు.. అవకాశాలే నావద్దకు వచ్చాయి

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె  కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికిస్తున్నారు. వారు బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారు. బీజేపీ ఆగడాలు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌లో చేరాను. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేం. బీఆర్‌ఎస్‌లో నాకు కేసీఆర్‌ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చాలా మంది ఆ పార్టీని వీడినా, నన్నే ఎక్కువగా టార్గెట్‌ చేశారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌కు చీడపురుగులా మారారు. నేను అవకాశ వాదిని కాదు. అవకాశాలే నావద్దకు వచ్చాయి. నన్ను రాజీనామా చేయాలని అడిగే హక్కు  బీఆర్‌ఎస్‌ నేతలకు లేదు అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :