ASBL Koncept Ambience
facebook whatsapp X

హిందూ అమెరికన్ల రక్షణకు కట్టుబడి ఉన్నాం : అమెరికా న్యాయశాఖ

హిందూ అమెరికన్ల రక్షణకు కట్టుబడి ఉన్నాం : అమెరికా న్యాయశాఖ

అమెరికా హిందూ సామాజిక వర్గంపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో.. వారి రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా న్యాయశాఖ పౌరవిభాగం స్పష్టం చేసింది. భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ మరియు శ్రీ తానేదార్ అనే నలుగురు భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులతో పాటు న్యాయ శాఖ గత వారం బ్రీఫింగ్‌లో తన నిబద్ధతను తెలియజేసిందని యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు.

"దేశవ్యాప్తంగా ద్వేషపూరిత నేరాల రేటు పెరగడం,అమెరికన్ హిందువులు మరియు వారి ప్రార్థనా స్థలాల విధ్వంసం మరియు ప్రమాదాలను ఎదుర్కొంటున్నందున .. గత వారం సమావేశం ఒక ముఖ్యమైన ప్రారంభమన్నారు కృష్ణమూర్తి. హిందూ అమెరికన్ కమ్యూనిటీకి ప్రయోజనాలు, రక్షణపై తన నిబద్ధతను న్యాయ శాఖ పునరుద్ఘాటించినప్పటికీ, ద్వేషపూరిత నేరాల నుండి హిందువులను మరియు ప్రతి ఇతర అమెరికన్ సమాజాన్ని రక్షించడానికి తాము పనిచేస్తూనే ఉంటామన్నారు. తమముందు ఇంకా చాలా సవాళ్లు మిగిలే ఉన్నాయన్నారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హిందువుల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంపై చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు

అమెరికా వ్యాప్తంగా హిందువులపై దాడులు, వారి ప్రార్థనాలయాల విధ్వంసం కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మార్చి నెలలో అమెరికా న్యాయశాఖకు భారత సంతతి చట్టసభ్యులు లేఖ రాశారు. ముఖ్యంగా దేశంలోని హిందూ దేవాలయాలపై చోటు చేసుకుంటున్న దాడులపై జరుగుతున్న దర్యాప్తుపై స్టేటస్ సమాచారం కోరుతూ... న్యాయశాఖలోని పౌర హక్కుల విభాగానికి లేఖ రాశారు. ఈ లేఖను యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి రాయగా మరో నలుగురు భారత సంతతి కాంగ్రెస్ సభ్యులు శ్రీథానేదర్, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీబెరాలు సంతకం చేశారు.హిందూ అడ్వకేసీ గ్రూప్ ‘‘ హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)( Hindu American Foundation ) ఈ లేఖ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

హిందూ మందిరాలు సహా దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో విధ్వంసకర సంఘటనలు పెరుగుతుండటాన్ని తాము గమనించామని వారు లేఖలో పేర్కొన్నారు. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు మందిరాలపై దాడులు హిందూ అమెరికన్లలో సామూహిక ఆందోళనను పెంచాయని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించారు. దీని కారణంగా కమ్యూనిటీ సభ్యులు భయం, బెదిరింపులు, హెచ్చరికల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నారని భారత సంతతి చట్టసభ సభ్యులు తెలిపారు. ఈ పక్షపాత, ప్రేరేపిత నేరాలకు సంబంధించి చట్ట అమలు సమన్వయం గురించి మా కమ్యూనిటీలు ఆందోళన చెందుతున్నాయి.

చట్టం ప్రకారం సమాన రక్షణను నిర్ధారించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ వుందా అని వారు ప్రశ్నించారు.అమెరికాలోని అన్ని మత, జాతి, సాంస్కృతిక మైనారిటీలపై ద్వేషాన్ని ఎదుర్కోవడానికి సహకారంతో పనిచేయాలని భారత సంతతి నేతలు పేర్కొన్నారు. అమెరికాలో హిందువులను లక్ష్యంగా చేసుకున్న ద్వేషపూరిత నేరాలకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వ్యూహం గురించి తమకు అవగాహన కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా. ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవార్డ్ నగరంలోని విజయ్ షెరావాలి ఆలయాన్ని కొందరు దుండగులు ఖలిస్తానీ అనుకూల నినాదాలతో అపవిత్రం చేశారు.దేవాలయం గోడలపై పిచ్చిరాతలు రాశారు.అంతకుముందు 2023 డిసెంబర్ 22న కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలోని స్వామినారాయణ్ మందిర్ వాసనా సంస్థ గోడలపైనా ఖలిస్తాన్ మద్ధతుదారులు అభ్యంతరక వ్యాఖ్యలు రాశారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :