ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేషసాయి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా (ఏసీజే) జస్టిస్ ఏవీ శేషసాయి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకానికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ( సీజే)గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిని ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో కేంద్రం నోటిఫికేష్ జారీ చేసింది.
Tags :