MKOne Telugu Times Youtube Channel

కిమ్ కు జో బైడెన్ వార్నింగ్... అది ముగిసినట్టే

కిమ్ కు జో బైడెన్ వార్నింగ్... అది ముగిసినట్టే

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణు దాడికి దిగితే, కిమ్‌ వంశ పాలనకు అది ముగింపేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్వేతసౌధంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్‌ యోల్‌తో జరిగిన సమావేశం అనంతరం బైడెన్‌ ఈ మేరకు వార్నింగ్‌ ఇచ్చారు. ఉత్తర కొరియా దూడుకుగా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్ష నేపథ్యంలో దక్షిణ కొరియాకు అమెరికా రక్షణ సహకారం మరింత పటిష్టమవుతుందని  ఇద్దరు నేతలు వెల్లడించారు. అమెరికా, దాని మిత్ర దేశాలపై ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే, మా నుంచి వచ్చే ప్రతిస్పందన విధ్వంసకరంగా ఉంటుంది. ఆ సమయంలో ఉత్తర కొరియాలోని పాలనకు అది ముగింపే బైడెన్‌ హెచ్చరించారు. ఆ దాడే జరిగితే, అమెరికా అణ్వాయుధాలతో సహా కూటమి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వేగంగా బదులిచ్చేందుకు అంగీకరించాయని యా సుక్‌ యెల్‌ వెల్లడించారు. 

 

 

Tags :