వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీతో జేఎన్‌టీయూ ఒప్పందం

వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీతో  జేఎన్‌టీయూ ఒప్పందం

పరిశోధన, విద్యాపరమైన కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీతో జేఎన్‌టీయూ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు  రెండు వర్సిటీల అధికారులు  ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమానికి వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ అధ్యక్షుడు, ఉపకులపతి ప్రొ, బార్నె గ్లోవర్‌, ప్రతినిధులు దేబొర స్వీని, లిండా టేలర్‌, అండర్‌సన్‌, నిషా రాకేశ్‌  హాజరవ్వగా, జేఎన్‌టీయూ తరపున ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌, ఐఎస్‌టీ వాతావరణ విభాగా అధిపతి విజయలక్ష్మి పాల్గొన్నారు.  జేఎన్‌టీయూలో బీటెక్‌లో చేరిన విద్యార్థులు మూడున్నరేళ్ల ఇక్కడ చదివాక మరో ఏడాదిన్నర వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీలో చదివి పీజీ పూర్తి చేయవచ్చని కట్టా నర్సంహారెడ్డి తెలిపారు. పర్యావరణ శాస్త్రం, వాతావరణ మార్పులపై ఇరు వర్సిటీలు కలిసి పనిచేయనున్నాయి.

 

Tags :