ASBL NSL Infratech

రూ.70,000 కోట్ల షేర్లు విక్రయిస్తున్న జెఫ్ బెజోస్!

రూ.70,000 కోట్ల షేర్లు విక్రయిస్తున్న జెఫ్ బెజోస్!

అమెజాన్‌ షేర్లను 1.2 కోట్లకు పైగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ విక్రయించారని, వాటి విలువ కనీసం 2.04 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.17,000 కోట్ల)కు పైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 7,8 తేదీల్లోనే 1,19,97,698 షేర్లను బెజోస్‌ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు సమాచారం. 8.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్‌ షేర్లను విక్రయించాలన్నది బెజోస్‌ ప్రతిపాదన. అమెజాన్‌ వ్యవస్థాపకులైన బెజోస్‌, ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి 2012లో వైదొలగి ఇతర ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :