ASBL NSL Infratech

ముక్కెరతో మతి పోగొడుతున్న స్టన్నింగ్ బ్యూటీ...

ముక్కెరతో మతి పోగొడుతున్న స్టన్నింగ్ బ్యూటీ...

బాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు జాన్వీ కపూర్. అతిలోక సుందరి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, ఓన్ టాలెంట్ తో త్వరగానే సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకుంది జాన్వీ. బాలీవుడ్ లో ధఢక్ సినిమాతో ఈ అమ్మడు తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మీడియా ఎటెన్షన్ ని పొందడానికి జాన్వీ చేయని ప్రయత్నం లేదు అంటే అతిశయోక్తి కాదు. అప్డేటెడ్ ఫోటో స్టిల్స్ తో సోషల్ మీడియాని, కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది జాన్వీ.

ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే జాన్వీ కపూర్ ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా కళాత్మకంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముక్కుకి ముక్కెరతో, ప్రశాంతమైన లుక్ తో ఈ అమ్మడు చూపరులని కట్టి పడేసింది. సాధారణంగా ఈ లుక్ అందరికి సూట్ అవ్వదు. కానీ, జాన్వీ ఈ లుక్ లో చాలా అందంగా కనిపించడం విశేషం. ముఖ్యంగా ఆ ముక్కెర ఈ అమ్మడి అందాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి. కాఫీ కలర్ చీరలో సరికొత్త అందాలతో జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్ కి ఆమె ఫాన్స్ తో పాటు కుర్రకారు ఫిదా అయిపోయారు.

ఈ ఫోటో చూడగానే టూ స్టన్నింగ్ అంటూ అభిమానులు జాన్వీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. "ముక్కుకు ముక్కెర అందం ఎవరీ బిజిలీ? ముక్కెరతో ప్రత్యక్షమైన దేవతా సుందరి! " అంటూ ఈ ముద్దుగుమ్మ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ లుక్ తో జాన్వీ కి ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో ఫుల్ గా అవకాశాలు వస్తాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జాన్వీ పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా, " జనగణమన " ఈ ఏడాది చివర విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :