ASBL NSL Infratech

చెప్పిన మాట‌కు ప‌వ‌న్ క‌ట్టుబ‌డ‌తాడా?

చెప్పిన మాట‌కు ప‌వ‌న్ క‌ట్టుబ‌డ‌తాడా?

మొన్న ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌వ‌న్ మీద ప‌డింది. ఎల‌క్ష‌న్స్ ప్రచారంలో భాగంగా ప‌వ‌న్ ఆ నియోజ‌క‌వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని ఒక‌సారి కాదు, ఎన్నోసార్లు నొక్కి మ‌రీ చెప్పాడు. కేవ‌లం ప‌వ‌న్ మాత్ర‌మే కాదు, ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి వ‌చ్చిన వాళ్లు కూడా అదే చెప్పారు.

ఆ మాట‌ల‌ని ఎంతో బ‌లంగా న‌మ్మిన ప్ర‌జ‌లు, ప‌వ‌న్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. అంతే కాదు క్యాంపైన్ టైమ్ లో ప‌వ‌న్ ఇక‌పై హైద‌రాబాద్ లో ఉండ‌న‌ని, పిఠాపురంలోనే ఉంటూ అక్క‌డి ప్ర‌జ‌లకు సేవ‌లందిస్తాన‌ని చెప్పాడు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే ప్రచారం టైమ్ లో ప‌వ‌న్ అక్క‌డ ఉండ‌టానికి ఒక ఇల్లును రెడీ చేసుకున్నాడు.

ఇప్పుడు ఎల‌క్ష‌న్స్ అయిపోయి ప‌వ‌న్ గెలిచాడు. ప‌వ‌న్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డే ర‌క‌మే అయినా అదెంత వ‌ర‌కు సాధ్య‌మ‌నేది చూడాలి. ఎందుకంటే ప‌వ‌న్ కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తే పిఠాపురంలోనే ఉండే అవ‌కాశముంటుంది. కానీ ప‌వ‌న్ మరోవైపు సినిమాలు కూడా చేయాలి. ఇప్ప‌టికే త‌న‌ను న‌మ్ముకుని మూడు సినిమా టీమ్‌లు ఉన్నాయి. వారంతా ప‌వ‌న్ రాక కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప‌వ‌న్ పిఠాపురంలో ఉండ‌టం కుద‌ర‌క‌పోవ‌చ్చు. ప‌వ‌న్ ఎక్క‌డున్నా స‌రే హైద‌రాబాద్ టూ పిఠాపురం త‌ర‌చూ తిర‌గాల్సి రావ‌డం మాత్రం ఖాయం. మ‌రి దీన్ని ప‌వ‌న్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :