ASBL NSL Infratech

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు: జానారెడ్డి కౌంటర్

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు: జానారెడ్డి కౌంటర్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకపక్క విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌పై దాడి చేస్తుంటే.. మరోపక్క కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు ఘాటు కౌంటర్‌లు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రస్తుతం ఓటమి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాగా.. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండే పరిస్థితి లేదని, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లు కూడా రావని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన జానారెడ్డి.. కేసీఆర్‌తో పాటు మిగిలిన బీఆర్ఎస్ నేతలంతా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, అందుకే వాళ్లు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ నేతలు ఇలాగే ఊదరగొట్టారని, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదని, ప్రజలే పట్టుకొమ్మలై కాంగ్రెస్‌కు అండగా నిలిచారని, ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేస్తే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృత్తం అవుతాయని జోస్యం చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :