ASBL NSL Infratech

సీనియ‌ర్ల‌తో రొమాన్స్ కు సై అంటున్న స్పై హీరోయిన్

సీనియ‌ర్ల‌తో రొమాన్స్ కు సై అంటున్న స్పై హీరోయిన్

స్పై సినిమాలో నిఖిల్ కు జోడీగా ప‌రిచ‌య‌మైన ఐశ్వ‌ర్య మీన‌న్ మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. కానీ రెండో సినిమా రావ‌డానికి మాత్రం చాలానే టైమ్ ప‌ట్టింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు న‌టించి భ‌జే వాయువేగం సినిమా మే 31న రిలీజ్ కానుంది. నిజానికి ఐశ్వ‌ర్య‌కు ఇదే మొద‌టి సినిమా. కానీ ప్రాజెక్ట్ లేట‌వ్వ‌డం వ‌ల్ల స్పై తో అమ్మ‌డి డెబ్యూ జ‌రిగిపోయింది.

భజే వాయువేగం సినిమాతో ఆడియ‌న్స్ కు మెప్పించ‌డానికి రెడీ గా ఉన్న ఐశ్వ‌ర్య‌, త‌మిళంలో యంగ్ హీరోల‌తో క‌లిసి బాగానే న‌టిస్తుంది. అయితే ఐశ్వ‌ర్య కేవ‌లం యంగ్ హీరోల‌తో మాత్ర‌మే కాదు, సీనియ‌ర్ హీరోల‌తో న‌టించడానికి, రొమాన్స్ చేయ‌డానికి కూడా రెడీ అంటోంది. రీసెంట్ గానే ఐశ్వ‌ర్య ఈ డెసిష‌న్ ను తీసుకుంద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టితో క‌లిసి ఓ సినిమా చేస్తోంద‌ట ఐశ్వ‌ర్య‌.

ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో వ‌య‌సు తేడా ఉన్న‌ప్ప‌టికీ అన్ని ర‌కాల పాత్ర‌లు చేయాల‌నుకుంటున్న‌ట్లు, సీనియ‌ర్ హీరోల‌తో న‌టితే అదొక గౌర‌వంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది ఐశ్వ‌ర్య‌. కానీ వేరే ఇండ‌స్ట్రీల్లో లాగా టాలీవుడ్ లో సీనియ‌ర్ల‌తో న‌టించే ఛాన్సులు ఈజీగా రావు. స‌క్సెస్ ఉంటేనే టాలీవుడ్ లో సీనియ‌ర్ల‌తో సినిమా చేసే ఛాన్స్ వ‌స్తుంది. కానీ ఐశ్వ‌ర్య‌కు ఇంకా అలాంటి స‌క్సెస్ మాత్రం రాలేదు. భ‌జే వాయువేగం సినిమా స‌క్సెస్ అయ్యి, ఆ త‌ర్వాత వ‌రుస‌గా మ‌రో రెండు మూడు సినిమాలతో హిట్ కొడితే అప్పుడు ఐశ్వ‌ర్య కోరిక తీరే అవ‌కాశ‌ముంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :