ASBL NSL Infratech

తెలంగాణ డీజీపీగా జితేందర్‌!

తెలంగాణ డీజీపీగా జితేందర్‌!

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడు జారీ కానున్నట్లు సమాచారం. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా, సీఎం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్‌ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :