ASBL NSL Infratech

RC16లో చ‌ర‌ణ్ పాత్ర గురించి లీకులు

RC16లో చ‌ర‌ణ్ పాత్ర గురించి లీకులు

ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజ‌ర్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. దీంతో త‌న త‌ర్వాతి సినిమా అయిన RC16 సినిమా ప‌నుల‌ను డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన వేగవంతం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రీ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్స్ తో పాటూ మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర ప్ర‌తిభ‌కు ప‌ట్టం కట్టాల‌నే నేప‌థ్యంలో ఆడిష‌న్స్ కూడా చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నడాట‌. ఓ పాత్ర మ‌న్యం జీవ‌న శైలిని పోలి ఉంటుందంటున్నారు. అందుకే బుచ్చిబాబు ఈ సినిమా కోసం ఉత్త‌రాంధ్ర న‌టుల్ని తీసుకుంటున్నాడ‌ట‌ని అంటున్నారు.  

సినిమాలో ఈ పాత్ర ఎంతో బ‌లంగా ఉంటుంద‌ని, క‌థ‌కు మెయిన్ లీడ్ కూడా ఇదే అవుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ లో కూడా డ్యూయల్ రోల్స్ లో క‌నిపించ‌నున్నాడు. ఇప్పుడు బుచ్చి బాబు సినిమాలో కూడా డ్యూయ‌ల్ రోల్ అంటే బ్యాక్ టు బ్యాక్ చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్స్ పోషిస్తున్న‌ట్లు అవుతుంది. చ‌ర‌ణ్ త‌న కెరీర్లో ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయ‌ల్ రోల్స్ చేసిన ప్ర‌తీ సినిమా ద్వారా మంచి విజ‌యాన్నే అందుకున్నాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :