ASBL NSL Infratech

ఇంట్రెస్టింగ్ లైన‌ప్‌తో దూసుకెళ్తున్న కార్తీ

ఇంట్రెస్టింగ్ లైన‌ప్‌తో దూసుకెళ్తున్న కార్తీ

సూర్య త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు త‌మిళ హీరో కార్తీ. ప్ర‌స్తుతం న‌లన్ కుమార‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో వా వాతియారే అనే సినిమాను చేస్తున్నాడు కార్తీ. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంది. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా వా వాతియారే ను తెర‌కెక్కిస్తున్నాడు డైరెక్ట‌ర్ న‌ల‌న్ కుమారస్వామి. ఈ సినిమా రిలీజ్ కు ముందే కార్తీ త‌న 30వ సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌ర్గ‌త స‌మాచారం ప్ర‌కారం కార్తీ త‌న 30వ సినిమాను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ త‌మీజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ని టాక్.

ఈ విష‌యమై కోలీవుడ్ మీడియాలో ఇప్ప‌టికే వార్తలొస్తున్నాయి. 1960 నాటి ప‌రిస్థితుల్లో రానున్న ఈ పీరియాడిక్ డ్రామా గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌ని, ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటూ స‌ర్దార్2 కు కూడా కార్తీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే ఆ సినిమా మొద‌లు కానుంది. మ‌రోవైపు ఖైదీ2 కు కూడా లోకేష్ రంగం సిద్ధం చేస్తున్నాడు. మొత్తానికి కార్తీ లైన‌ప్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :