ASBL Koncept Ambience
facebook whatsapp X

భారతీయుడు2 బ్రేక్ ఈవెన్ టార్గెట్

భారతీయుడు2 బ్రేక్ ఈవెన్ టార్గెట్

లంచం తీసుకునే అవినీతిప‌రుల‌కు మ‌ర‌ణ శిక్ష విధించే సేనాప‌తిగా 28 ఏళ్ల కింద‌ట క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు సినిమాలో త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. అప్ప‌టివ‌ర‌కు లంచం గురించి స‌మాజాంలో మాట్లాడుకోవ‌డ‌మే త‌ప్పించి ఎదిరించాల‌నే ధైర్యం మాత్రం ఎవ‌రికీ లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా భార‌తీయుడు2 వ‌స్తోంది.

ఈ సినిమా కూడా సొసైటీలో పెరిగిన అవినీతి గురించే ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఈసారి సేనాప‌తి ఎలాంటి శిక్ష‌లు విధించ‌నున్నాడ‌నేది ఈ సినిమాలో శంక‌ర్ చూపించ‌నున్నాడు. జులై 12న భార‌తీయుడు2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వాస్త‌వానికి శంక‌ర్ సినిమాల‌కు తెలుగులో కూడా మంచి బిజినెస్ జ‌రుగుతుంది. కానీ శంక‌ర్ నుంచి ఆఖ‌రిగా వ‌చ్చిన ఐ, రోబో 2.0 సినిమాలు డిజాస్ట‌ర్ అవ‌డంతో బ‌య్య‌ర్ల‌కు భారీ న‌ష్టాలొచ్చాయి.

ఆ ఎఫెక్ట్ ఇప్పుడు భార‌తీయుడు2 మీద ప‌డింది. ఈ సినిమాకు ఆంధ్రాలో 12 కోట్లు, నైజాంలో రూ.9 కోట్ల బిజినెస్ జ‌ర‌గ్గా సీడెడ్ లో రూ.4 కోట్ల బిజినెస్ జ‌రిగింది. మొత్తం మీద థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.25 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. క‌మ‌ల్, శంక‌ర్ ఇమేజ్ కు ఈ బిజినెస్ చాలా త‌క్కువ‌. భార‌తీయుడు సినిమాకు సీక్వెల్ అనే కార‌ణం త‌ప్పించి భార‌తీయుడు2 మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్ద‌గా బ‌జ్ లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.26 కోట్ల షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :