అమెరికాలో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి మృతి
భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒహాయోలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి కారణాలు తెలియరాలేదని వారు చెప్పారు. అంతకుమంచిన వివరాలు వెల్లడిరచలేదు. శ్రేయాస్ రెడ్డి సిన్సినాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి. అతని తల్లి దండ్రులకు సమాచారం అందించామని, వారు భారత్ నుంచి రానున్నారని కాన్సులేట్ వర్గాలు వెల్లడిరచాయి. జార్జియ రాష్ట్రంలోని లిథోనియాలో ఇటీవలే వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.
Tags :