ASBL NSL Infratech

అమెరికాలో మరో ఘటన.. భారత సంతతి వ్యాపారవేత్తను

అమెరికాలో మరో ఘటన.. భారత సంతతి వ్యాపారవేత్తను

అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారు వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి  చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివేక్‌ తనేజా(41) అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న టెక్నాలజీ సొల్యూషన్స్‌,అనలైటిక్‌ ప్రొడక్ట్‌ ప్రొవైడర్‌ డైనమో టెక్నాలజీస్‌ సహా వ్యవస్థాపకుడు. ఈయన వర్జీనియాలో నివాసముంటున్నారు. ఫిబ్రవరి 2న ఓ  రెస్టరంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల  సమయంలో బయటకు వచ్చారు. వీధిలో నుంచి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో గొడవ జరిగింది. అది కాస్తా తీవ్రమవడంతో దుండగుడు ఆయనపై దాడి చేశాడు.

వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవ్వడంతో ఆయన అపాస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి  చేరుకుని, ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్‌ ప్రాణాలు కోల్పోయారు. వారి మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని అధికారులు  వెల్లడించలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేసి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు. అతడి కోసం గాలింపులు చేపట్టారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :