ASBL NSL Infratech

అవసరమైతే బైడెన్ ను చంపాలనుకున్నా.. సాయి వర్షిత్

అవసరమైతే బైడెన్ ను చంపాలనుకున్నా..  సాయి వర్షిత్

గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద ఓ యువకుడు ట్రక్కు తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన భారత సంతతి కుర్రాడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి, నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు అటార్నీ తెలిపింది. దీంతో ఈ కేసులో అతడికి ఆగస్టు 23న శిక్ష ఖరారు చేయనున్నట్లు యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు వెల్లడిరచింది. 

2023 మే 22న ఈఘటన చోటు చేసుకుంది. సాయి వర్షిత్‌ అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్‌ వద్ద బీభత్సం సృష్టించాడు. శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఇందుకోసం అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్‌, ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు తెలిపారు. ఉద్దేశపూరితంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్‌ అటార్నీ తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :