ASBL NSL Infratech

అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు

అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు

అమెరికా లోని కాలిఫోర్నియా నగర మేయర్‌పై  భారత సంతతికి చెందిన ఓ మహిళ  ఉగ్ర  బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన బేకర్స్‌ఫీల్డ్‌ సిటీ కౌన్సిల్‌ సమావేశంలో చోటు చేసుకుంది. మేయర్‌ ఆదేశాల మేరకు తక్షణమే అమెను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. బేకర్స్‌ఫీల్డ్‌లో జరిగిన సమావేశంలో రిద్ధి పటేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ అణిచివేత, ఇజ్రాయెల్‌` హమాస్‌ అంశాలను ప్రస్తావించిన ఆమె మేయర్‌ కరెన్‌ గోప్‌ాపై విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్‌` హమాస్‌ వ్యవహారంలో కాల్పుల విరమణ తీర్మానానికి మద్దతు ఇవ్వనుందుకు వారిపై మండిపడ్డారు. అణచివేతకు గురైన మైనారీటీలు హింసాత్మక విప్లవం ద్వారా ఏదో ఒకరోజు మిమ్మల్ని అంతం చేస్తారని నగర అధికారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హిందూవుల చైత్ర నవరాత్రులు మొదలయ్యాయి. దీన్ని ఆచరించే మేము, గ్లోబల్‌ సౌత్‌లోని ఇతర ప్రజలు తమ అణచివేతదారులపై హింసాత్మక విప్లవాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు ఎవరైనా గిలెటిన్‌తో మీ అందరినీ చంపేస్తారని ఆశిస్తున్నా అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద మెటల్‌ డిటెక్టర్లు, అదనపు భద్రతను ఏర్పాటు చేయడం నిరసనకారులను నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నమే అంటూ తప్పుబట్టారు. మిమ్మల్ని హత్య చేసేందుకు మీ ఇంట్లో కలుద్దాం అంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మేయర్‌ ఫైర్‌ అయ్యారు. తక్షణమే పటేల్‌ను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :