అమెరికా ఎయిర్‌ఫోర్స్ లో కీలక పదవిలో తెలుగు వ్యక్తి!

అగ్రరాజ్యం అమెరికాలో భారత అమెరికన్, తెలుగు వ్యక్తి రాజాచారి మరో అరుదైన ఘనత అందుకోబోతున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవికి రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు యూఎస్ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నామినేషన్‌ను సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అమెరికా ఎయిర్‌పోర్స్‌లో బ్రిగేడియర్ జనరల్ అనేది వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంక్ హోదా. దీని తర్వాత మేజర్ జనరల్ హోదా దక్కుతుంది. 45 ఏళ్ల రాజా చారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో ఉన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ`3 కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది అంతరిక్ష యానం కూడా పూర్తి చేసుకున్నారు.
Tags :