MKOne Telugu Times Business Excellence Awards

అమెరికాలో పంజాబీ నటుడిపై దాడి

అమెరికాలో పంజాబీ నటుడిపై దాడి

అమెరికాలో పంజాబ్‌ నటుడు అమన్‌ ధలివాల్‌పై దాడి జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఓ వైపు గాయాలతో రక్ష్తమొడుతున్నా నటుడు సదరు వ్యక్తి దాడి చేయకుండా చేతిని పట్టుకున్నాడు. ఆ తర్వాత అదును కోసం చూస్తూ ఒక్కసారిగా నిందితుడిపై దాడి చేశాడు.  ఆ తర్వాత దాడికి పాల్పడిన వ్యక్తిని మరికొందరు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఆ తర్వాత అమన్‌ అసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. మెడతో పాటు చేతులకు కత్తి గాయాలయ్యాయి.  అమన్‌ స్వస్థలం పంజాబ్‌లోని మన్సా కాగా, హృతిక్‌ రోషన్‌, ఐశ్వర్యరాయ్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ చిత్రం జోధా అక్బర్‌ తో పాటు పలు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. 

 

 

Tags :