మండలికి మరోసారి ఎన్నికైన భారత్
అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంవో) మండలికి భారత్ మరోసారి ఎన్నికైంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో అత్యధిక స్థాయిలో ఓట్లను సాధించింది. ప్రపంచ నౌకాయాన కార్యకలాపాలకు భారత్ తరపున మరింత మెరుగ్గా సేవలు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం ఒక నిదర్శనమని బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి వ్యాఖ్యానించారు. ఐఎంవో అనేది ఐరాస అనుబంధ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానం, వాణిజ్యం, సముద్ర సంబంధ వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అధిక ప్రయోజనాలు కలిగిన పది దేశాల కేటగిరీలో 167 ఓట్లకు గాను 157 ఓట్లను భారత్ సాధించింది.
Tags :