షర్మిలక్క కు పొంచి ఉన్న ముప్పు.. అందుకే భద్రత పెంపు..
వైయస్ షర్మిల .. అన్నకి పట్టం కట్టడం కోసం పాదయాత్రకు పూనుకొని 2019 ఎన్నికల్లో జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అయితే ఆ తరువాత అన్న పుణ్యమా అని నిన్న మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా కనిపించింది కూడా లేదు. తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమైన షర్మిల ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల జోరును పెంచడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిలక్క .. జగనన్నని ఒక రేంజ్ లో ఉతికి ఆరేస్తోంది.
ఈ నేపథ్యంలో మొన్న ఓపెన్ గా తన భద్రతపై షర్మిల అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ ఉంది. అయితే ప్రస్తుతం షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పిసిసి అధ్యక్షురాలు హోదాలో పర్యటిస్తోంది. దీంతో ఆమె సెక్యూరిటీ పై పార్టీ శ్రేణులు కూడా కాస్త కలత చెందుతున్నారు. బహిరంగ సభలతో పాటు షర్మిల రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సభలలో ఆమె అధికార పార్టీని తన స్టైల్ లో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరు జగన్ సర్కారు ను ప్రశ్నించినటువంటి కోణంలో షర్మిల తన వాడి ..వేడి ప్రశ్నలను బాణాలుగా సంధించి వదులుతున్నారు.
మొదట్లో షర్మిలకు కేటాయించిన టు ప్లస్ టు భద్రతను వన్ ప్లస్ వన్ కు తగ్గించడంతో ఆమె తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా డీజీపీకి చాలాసార్లు ఆమె భద్రత గురించి ఉత్తర్వులు రాయడం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రోటోకాల్ అంశాలను లెక్కలోకి తీసుకుంటూ షర్మిల భద్రత ఏర్పాట్లు పెంచారు. భద్రత ప్రమాణాల నిబంధనల ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. షర్మిల ఎంట్రీ తో రాబోయే ఎన్నికలు మరింత రంజుగా మారాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు.