ASBL NSL Infratech

'ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు' ఫస్ట్ లుక్ గ్రాండ్ రిలీజ్

'ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు' ఫస్ట్ లుక్ గ్రాండ్ రిలీజ్

రాజా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని సినిమా, ఎవరు ఇవ్వని పెర్ఫార్మన్స్ తో  'ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు' అనే సినమా రూపొందుతుందని హీరో, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సూపర్ రాజా పేర్కొన్నారు. ఒకే షాట్ లో తెరకెక్కిన రెండు గంటలో సినిమాలో దాదాపు పదిహేను వందల డైలాగ్ లు బ్రేక్ లేకుండా చెప్పమని, దాని కోసం హీరో సూపర్ రాజా మరియు వంశి గొనె ఇద్దరు కలిసి 7 నెలలు విరామం లేకుండా రిహార్సల్స్ చేశామని చెప్పారు. ఒకే షాట్ లో ఆక్ట్ చేస్తూ, అలానే డైరెక్ట్ కూడా చేయడం చాల కష్టమైనా ఇష్టపడి అన్ని అడ్డంకులను ఎదుర్కొని సినిమా పూర్తి చేశానని సూపర్ రాజా అన్నారు.

సినిమా చూశాక ప్రతి ఒక్కరు సినిమా ఇలా కూడా ఉంటుందా, యాక్టింగ్ ఇలా కూడా చేస్తారా అని అంటారని సూపర్ రాజా తెలిపారు. సోమవారం ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేసిన 8 నిమిషాల టైటిల్ లాంచ్ వీడియో అందరిని అబ్బురపరిచింది. గ్రాఫిక్స్, విసువల్స్, కాన్సెప్ట్, పెర్ఫార్మన్స్, మ్యూజిక్, దర్శకత్వం, నటన తో చుసిన వాళ్లకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. సినిమా కూడా ఇంతకు మించి ఉంటుంది అని సూపర్ రాజా అన్నారు.

ఈ సినిమాలో ప్రతి ఒక్క అంశం ఎప్పుడు చూడని విధం గా ఉంటుందని గర్వంగా చెప్పారు. రెండు గంటల సింగల్ షాట్ సినిమాలో మధ్యలో ఒక సాంగ్ కూడా ఉందని, అన్ని డైలాగ్ లు చెప్తూ, సాంగ్ ని గుర్తు పెట్టుకొని ఒక్క ఎక్స్ ప్రెషన్ తప్పకుండా అయిదు నిమిషాల సాంగ్ కి ఆక్ట్ చేసి మళ్ళీ తరువాత ఇంకో 500 డైలాగ్ లు, స్టోరీ కొనసాగించడం ఎంత కష్టమో ఊహించడానికే వీలు కాదు అన్నారు. ఆ కష్టం, కసి, ఓర్పు అంత రేపు మీరు సినిమాలో చూడచ్చు అని సూపర్ రాజా ఎంతో ధైర్యం తో, కాన్ఫిడెన్స్ తో తెలిపారు.

నటి రమ్య ప్రియ మాట్లాడుతూ.. ఇది తనకు మొదటి సినిమా అని. ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎవరు చేయని కళామ్మ తల్లి పాత్ర సూపర్ రాజా తనకు ఇవ్వడం చాల సంతోషంగా ఉందని, ఎంత కష్టమైనా ఆ పాత్రలోని ప్రతి ఫీలింగ్, ఆలోచన అర్ధం చేసుకుని నాతో వంద శాతం న్యాయం చేపించారు రాజా అని రమ్య ప్రియ అన్నారు.

ముఖ్య పాత్రలో నటించిన వంశి గొనె మాట్లాడుతూ.. "బిజినెస్ చేసుకునే నాకు యాక్టింగ్ లో ఇంటరెస్ట్ రావడం తో థియేటర్ లో నటన నేర్చుకున్నాను. మంచి అవకాశం తో ఎదురు చూస్తున్న నాకు, సూపర్ రాజా సింగల్ షాట్ సినిమా అనే కాన్సెప్ట్ తో కలిశాడు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ల అనిపించింది. ఇలాంటి ఒక్క సినిమా చేస్తే యాక్టింగ్ పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుందని వెంటనే ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు ఈ సూపర్ రాజా నాకు 7  నెలలు నరకం చూపెట్టాడు. చండ శాసనుడిలా ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి డైలాగ్ కరెక్ట్ గ వచ్చేవరకు టార్చర్ పెట్టేవాడు. కానీ ఈ రోజు గర్వం గ చెప్తున్నా, ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టింగ్  నిజంగా మీరెప్పుడు చూసుండరు. మేము ఇద్దరం పడ్డ కష్టం, మా ఇద్దరి నటన మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని" అన్నారు.

ఈ చిత్రానికి హీరో అమ్మ, నాన్న, అక్క, అన్న డబ్బు పెట్టారని. వరంగల్ లో మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన తను ఫామిలీ సపోర్ట్ తో ఈ సినిమా తీయగలిగానని సూపర్ రాజా చెప్పారు. భయపడకుండా, ధైర్యం తో, సినిమా పరిశ్రమకు గౌరవం ఇస్తూ తీసిన ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇలాంటి కొత్త సినిమా ని ప్రోత్సహిస్తే సంవత్సరానికి ఇలాంటివి ఇంకో 3 , 4 వస్తాయని, ఇదే తెలుగు సినిమా ని ముందుకు నడిపిస్తుంది అని చెప్తూ, సూపర్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి, ఇక ముందు అన్ని కొత్త సినిమా లే తీస్తానని సూపర్ రాజా తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :