'హాయ్ నాన్న' టీంని అభినందించిన అల్లు అర్జున్ - ధన్యవాదాలు తెలిపిన నాని
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న' అన్ని వైపుల నుంచి ప్రశంసలను పొందుతోంది. ఇటువంటి అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో వచ్చినందుకు చాలా మంది ప్రముఖులు నాని, టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. అల్లు అర్జున్ 'హాయ్ నాన్న' టీమ్ మొత్తానికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ రాశారు.
“హాయ్ నాన్న మొత్తం టీమ్‌కి అభినందనలు. ఎంతో మధురమైన చిత్రమిది. నిజంగా మనసుని హత్తుకుంది. బ్రదర్ నాని గారు అద్భుతమైన నటన కనపరిచారు. ఇటివంటి మంచి కథను చేసినందుకు చాలా గౌరవంగా వుంది. డియర్ మృణాల్. మీ స్వీట్ నెస్ తెరపై వెంటాడుతోంది. మీలాగే అందంగా ఉంది. బేబీకియారా !మై డార్లింగ్.. నీ క్యూట్‌నెస్‌తో మనసుని ఆకట్టుకున్నావ్. చాలు..ఇక స్కూల్ కి వెళ్ళు మిగతా ఆర్టిస్ట్‌లందరికీ వారి చక్కని నటనకు & సాంకేతిక నిపుణులకు అభినందనలు. ముఖ్యంగా కెమెరామెన్ @SJVarughese & సంగీత దర్శకుడు @HeshamAWMusic అద్భుతమైన పనితీరు కనపరిచారు. దర్శకుడు @శౌర్యువ్ గారు.. అభినందనలు ! మీరు మీ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. మనసులని హత్తుకునే & కన్నీళ్ళు తెప్పించే మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. .అద్భుతమైన ప్రెజెంటేషన్. ఇలాంటి స్వీట్ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు. #HiNanna కేవలం తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుల మనసులని హత్తుకుంటుంది'' అని అభినందించారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ మాటలను నిజం చేస్తూ, హృదయాన్ని కదిలించే కాన్సెప్ట్, అసాధారణమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలన్న 'హాయ్ నాన్న'ను ప్రతి కుటుంబ సభ్యులు ఇష్టపడుతున్నారు.
'హాయ్ నాన్న'ను ప్రోత్సహించినందుకు అల్లు అర్జున్ కు ధన్యవాదాలు తెలిపారు నాని. “అర్హ నాన్న ఆమోదించారు:)'థాంక్ యూ సో మచ్ డియర్ బన్నీ. మంచి సినిమా కోసం నువ్వు ఎప్పుడూ ఉంటావు♥️ #HiNanna" అని నాని బదులిచ్చారు.
ఈ సినిమా ప్రమోషన్ కోసం నాని ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్న సంగతి తెలిసిందే, ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
హాయ్ నాన్న తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం 4 రోజుల్లో 40 కోట్ల గ్రాస్‌తో సాలిడ్ నోట్‌తో ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.