ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బ్రాండ్ మోదీ.. బ్రాండ్ ఇండియా..

బ్రాండ్ మోదీ.. బ్రాండ్ ఇండియా..

అంతర్జాతీయంగా అత్యంత ప్రభావశీలురైన నేతల్లో భారత ప్రధాని మోదీ ఒకరు. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కోట్లలో ఉంటారు. అంతెందుకు అత్యంత కఠినమైన నిబంధనలు అమలయ్యే చైనాలో సైతం మోదీకి లక్షలాది అభిమానులున్నారు. వరుసగా సరిహద్దు ఘర్షణలు జరగక ముందు..చైనీస్ సోషల్ మీడియా దిగ్గజం షినా విబోలోనూ మోదీకి ఎకౌంట్ ఉండేది. అయితే ఘర్షణల తర్వాత దాన్ని క్లోజ్ చేశారు.

జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ అడిగారట. మీకున్న పాపులారిటీ చూస్తుంటే, మీదగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలని సరదాగా వ్యాఖ్యానించారట. జి-7 సదస్సులో పాల్గొనేందుకు హిరోషిమా వచ్చిన ప్రధాని మోదీ.. వివిధ దేశాధినేతలతో సమావేశమవుతూ బిజీగా మారారు. ఈసందర్భంగా బైడెన్ తాను ఎదుర్కొేంటున్న ఓ సమస్యను మోదీ ముందు ఉంచారు.మీ సమావేశాల్లో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారన్నారు.తానెప్పుడూ కలవని, పరిచయం లేనివారు సైతం ఫోన్లు చేసి మోదీని కలిసే అవకాశం ఇప్పించాలని కోరుతున్నట్లు చెప్పారని సమాచారం.

మరోవైపు  ఆసిస్ ప్రధాని ఆల్బనీస్ సైతం.. తాను ఇలాంటి సమస్యే ఎదుర్కొేంటున్నట్లు భారత ప్రధాని మోదీకి చెప్పినట్లు సమాచారం.సిడ్నీలో ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈస్టేడియంలో కేవలం 20 వేల మందికి మాత్రమే సరిపడా ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పటికే టికెట్లు అమ్ముడయ్యాయి. అయినా టికెట్ల కోసం విజ్ఞప్తులు వస్తున్నాయని.. చెప్పినట్లు తెలుస్తోంది.

మోదీ విదేశాల్లో జరిగే ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడి ప్రవాసుల సందడి మామూలుగా ఉండదు. మోదీతౌో సెల్ఫీలు, ముఖాముఖీ సంభాషణలు ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించడంతో..అక్కడి ప్రవాసీ భారతీయుల ఓట్లు సాధించే ప్రయత్నం బైడెన్ చేశారా అన్న అనుమానాలున్నాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :