ASBL NSL Infratech

అందరికీ ఇచ్చి పడేసిన హైపర్ ఆది..!

అందరికీ ఇచ్చి పడేసిన హైపర్ ఆది..!

హైపర్ ఆది పంచ్ లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మైక్ పట్టుకున్నాడంటే పంచ్ ల వర్షం కురుస్తుందంతే. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హైపర్ ఆది.. ఇప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కమెడియన్ కానే కాదు.. రాజకీయంగా కూడా ఆది కొంచెం యాక్టివ్ అయ్యారనే చెప్పొచ్చు. జనసేన తరపున ఆయన అప్పుడప్పుడు గళం వినిపిస్తున్నారు. మెగా ఫ్యామిలీపై ఎవరేమన్నా విరుచుకుపడిపోతుంటారు హైపర్ ఆది. తాజాగా భోళాశంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది.. అందరి పైన పంచ్ లతో విరుచుకుపడ్డారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది స్పెషల్ అట్రాక్షన్ గా సాగారు. దాదాపు 15 నిమిషాలు ప్రసంగించిన హైపర్ ఆది.. మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసే వాళ్లందరినీ టార్గెట్ చేసి దుమ్ము దులిపేశారు. పేరు పెట్టకుండా అందరినీ కడిగి పారేశారు. అంబటి రాంబాబు, రామ్ గోపాల్ వర్మ, గరికపాటి, యూట్యూబ్ చానళ్లు.. ఇలా అందరినీ ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ పంచ్ లు విసిరారు. మెగా ఫ్యామిలీ గొప్పదనాన్ని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి చూడని రికార్డులు లేవన్నారు..

గరికపాటి ఆమధ్య చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా చిరంజీవి ఆయన పక్కన కూర్చుని సభ సజావుగా సాగేందుకు సహకరించారు. అదీ చిరంజీవి మంచితనం అని హైపర్ ఆది వివరించారు. ఓటు హక్కు ఉందో లేదో చెక్ చేసుకునేందుకు క్యూలైన్ దాటి పక్కకు వెళ్లిన చిరంజీవిపై ఓ ఎన్నారై అవాకులు చెవాకులు పేలారన్నారు. అయినా ఆయన ఆ ఎన్నారైపే నోరు మెదపలేదన్నారు. టాలీవుడ్ లో ఓ దర్శకుడు చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవి పైనా, పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ కల్యాణ్ పైనా విమర్శిస్తుంటారని.. అలాంటి వాటిని పట్టించుకోవద్దన్నారు. అలాంటి వాళ్ల ‘వ్యూహాలు’ బెడిసి కొడతాయన్నారు. జగన్ బయోపిక్ నేపథ్యంలో వ్యూహం అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా కలెక్షన్లపై సెటర్లు వేశారు. దాన్ని కూడా హైపర్ ఆది లేవనెత్తారు. భోళా శంకర్ సినిమా ప్రొడ్యూసర్లు కలెక్షన్లు గురించి పట్టించుకోవద్దన్నారు. ఈ మధ్య ఎలక్షన్ల గురించి మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారని.. వాళ్లు కలెక్షన్లు అన్నీ చెప్తారని సెటైర్లు వేశారు. బ్రో సినిమా కలెక్షన్లు తక్కువ వచ్చాయన్నారని.. ఆయినా ఆయన వెనకేసుకున్న కలెక్షన్లతో పోల్చితే మన కలెక్షన్లు తక్కువే ఉంటాయని ఎద్దేవా చేశారు. అలాగే కొన్ని యూట్యూబ్ చానళ్లు సుమన్, ఉదయ్ కిరణ్ వాళ్లను వాడుకుని మెగా ఫ్యామిలీపై బరద జల్లుతుంటాయన్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని.. ఆయన పైన కూడా మొదట్లో చాలా మంది సెటైర్లు వేశారని చెప్పారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారన్నారు హైపర్ ఆది. కానీ పవన్ కల్యాణ్ మొండోడు కాబట్టి అందరి లెక్కా తేల్చేస్తారని ముగించారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :