ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్నారైవిఎ గ్లోబల్ కన్వెన్షన్ కు మంచి స్పందన

ఎన్నారైవిఎ గ్లోబల్ కన్వెన్షన్ కు మంచి స్పందన


ఎన్నారై వాసవి అసోసియేషన్  7వ గ్లోబల్ కన్వెన్షన్ సెయింట్ లూయిస్ నగరంలో జులై 4, గురువారం రోజున కోలాహలంగా ప్రారంభమయింది. అమెరికాస్ సెంటర్ కన్వెన్షన్ కి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారై వాసవీ నాయకులు, కమిటీ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నలుమూలల నుండి పలువురు వాసవైట్స్ తరలిరావడంతో వేదిక ప్రాంగణం సందడిగా తయారైంది. ఎన్నారై విఎ అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల, కో-కన్వీనర్ వంశి గుంటూరు, కన్వెన్షన్ సెక్రటరీ ఫణీశ కోడూరి, కన్వెన్షన్ ట్రెజరర్ శేఖర్ పేర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ బాపనపల్లి, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తడకమళ్ల, ట్రెజరర్ గంగాధర్ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వివిధ కమిటీల ఈ వేడుకకు వచ్చినవారికి చక్కని ఆతిధ్యంతో కూడిన ఏర్పాట్లు చేశారు. వ్యాఖ్యాతలు వర్షిణి మరియు సమీరా బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలికారు. వాసవి మాత జీవిత వృత్తాంతాన్ని ప్రతిబింభిస్తూ ప్రదర్శించిన దృశ్య కావ్యం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురు వాసవైట్స్ కి అవార్డులు అందించారు. సినీ నటి లయ, బిగ్ బాస్ రన్నరప్ అమర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :