Radha Spaces ASBL

టిల్లూ స్క్వేర్ కు య‌మా క్రేజ్

టిల్లూ స్క్వేర్ కు య‌మా క్రేజ్

డీజే టిల్లూకి సీక్వెల్ గా వ‌స్తోన్న టిల్లూ స్క్వేర్ సినిమాపై అందరికీ భారీ అంచ‌నాలున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ప‌లుసార్లు వాయిదా ప‌డి ఇప్పుడు మార్చి 29న రిలీజ్ కు రెడీ అయింది. సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసింది. ట్రైల‌ర్ ను నెల రోజుల ముందు రిలీజ్ చేయ‌డం వెనుక నిర్మాణ సంస్థ చేసిన బిజినెస్ ప్లాన్ బాగానే వ‌ర్క‌వుట్ అయినట్లు తెలుస్తోంది.

ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం టిల్లూ స్వ్కేర్  కు బిజినెస్ ప‌రంగా బాగా క్రేజ్ పెరిగిన‌ట్లు తెలుస్తోంది. థియేట్రిక‌ల్ రైట్స్ కు దాదాపు రూ.30 కోట్ల వ‌ర‌కు ప‌లుకుతున్న‌ట్లు స‌మాచారం. టిల్లూ బ్రాండ్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బయ్య‌ర్లు ఇంత మొత్తం పెట్టి హ‌క్కుల‌ను కొన‌డానికి రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

దానికి తోడు హీరోయిన్ అనుప‌మ గ్లామ‌ర్ షో, లిప్ లాక్స్ కూడా సినిమాకు ప్ల‌స్ కానున్నాయి. డైరెక్ట‌ర్ మారినా స‌రే ఎవ్వ‌రికీ ఆ విష‌య‌మే గుర్తు లేదు. దానికి కార‌ణం ట్రైల‌ర్. అందుకే బిజినెస్ కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ సైతం ఫ్యాన్సీ రేట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. మార్చి ఫ‌స్ట్ వీక్ నుంచి సినిమాకు భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించ‌నున్నారు మేక‌ర్స్. ఈ సినిమా త‌ర్వాత వారం గ్యాప్ లో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుండ‌టంతో టిల్లూ స్క్వేర్ సినిమాకు హిట్ టాక్ రావ‌డం చాలా కీల‌కం కానుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :