ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి కారణం జగన్.. అంబటి రాంబాబు..
ఆంధ్రాలో నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల కు తరలివచ్చారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగింది అని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో నిన్న జరిగిన పోలింగ్ కు ఓటర్లు వెల్లువలా వచ్చి పోలింగ్ కేంద్రాలలో ఓట్లు వేయడానికి కారణం జగన్ అని అభివర్ణించారు. కేవలం జగన్ కోసం తాపత్రయ పడడం వల్ల అంతమంది వచ్చి ఓటు వేశారని.. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని భావించే వాళ్లకు జగన్ గెలుపే సమాధానమని అంబటి పేర్కొన్నారు. జగన్ ను మరొకసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేయడం కోసం భారీగా మహిళలు ముందుకు వచ్చారని.. 70 శాతం మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని. నిన్న ఉదయం 6:00 నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని.. మహిళలు, వృద్ధులు మండే ఎండను కూడా లెక్కచేయకుండా పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారని అంబటి వివరించారు.