Radha Spaces ASBL

స్వామి కార్యం.. స్వకార్యం?

స్వామి కార్యం.. స్వకార్యం?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం కొండపి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిపై.. తాడేపల్లి ప్యాలెస్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛభారత్ నిధుల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ ఇంచార్జ్ అశోక్ బాబు... ఎమ్మెల్యే స్వామి ఇంటిముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా అశోక్ బాబు తీరును నిరసిస్తూ.. స్వామి, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా టంగుటూరు బయలుదేరాయి. జాతీయ రహదారిపైనే టీడీపీనేతలను అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే స్వామి సహా పలువురిని అరెస్ట్ చేశారు.

కొండపి వైసీపీలో బలమైన నేతగా అశోక్ బాబుకు పేరుంది. అయితే ఆయన పోకడలతో అసమ్మతి సైతం అంతే బలంగా మారుతోంది. అసమ్మతి నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి.. ఈసారి కొండపి టికెట్ అశోక్ బాబుకు ఇవ్వొద్దంటూ హైకమాండ్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అశోక్ బాబు మాత్రం.. కొండపిలో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ మూుందుకు సాగిపోతున్నారు. దీంతో ఆయనకు టికెట్ రాకుండా చేసేందుకు.. అసమ్మతి వర్గం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో కొండపి టికెట్ రేసులో ఉన్న అశోక్ బాబు.. తన బలాన్ని, పార్టీకి విథేయతను ప్రదర్శించేందుకు.. ఛలో తూర్పునాయుడు పాలెం పిలుపునిచ్చినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే  ఇంటిముట్టడికి పిలుపునివ్వడం ద్వారా తాను .. టీడీపీపై గట్టిగా పోరాటం చేస్తున్నట్లు కార్యకర్తలకు సంకేతమిచ్చినట్లు అవుతుందని అశోక్ బాబు భావిస్తున్నారు. దీనికి తోడు పార్టీలో ఎమ్మెల్యే టికెట్ పైనా ఖర్చీఫ్ వేసినట్లుగా ఆయన వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.

అసలు కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న అశోక్ బాబుకు... వర్గ పోరు అధికంగా ఉంది . ఇప్పటికే అశోక్ బాబు టీడీపీ కోవర్టు అంటూ పలువురు వైసీపీ నేతలు... పలుమార్లు తాడేపల్లి ప్యాలెస్ కు ఫిర్యాదు చేశారు. తెలుసుకో జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన కూడా తెలిపారు. అయితే వాటిని పట్టించుకోని అశోక్ బాబు... పార్టీ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అంతే కాదు.. గతంలో స్వామి వైసీపీ కొండెపి ఇంచార్జ్ పదవి నుంచి సైతం తొలగిేంచారు. వీటన్నింటినీ అధిగమించి మరీ .. అశోక్ బాబు కొండపెిలో వైసీపీకి ఆయువుపట్టులా మారారు. దీనికి తోడు హైకమాండ్ సైతం అశోక్ బాబుకు మద్దతుగా నిలుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :