ASBL NSL Infratech

సైలెంట్ గా ప‌ని కానిచ్చేస్తున్న ప్ర‌భాస్ డైరెక్ట‌ర్లు

సైలెంట్ గా ప‌ని కానిచ్చేస్తున్న ప్ర‌భాస్ డైరెక్ట‌ర్లు

మామూలుగా ఎవ‌రైనా స‌రే ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తున్నామంటే ఎగిరి గంతేసి ఊరంతా వినిపించేలా చెప్పుకుంటారు. కానీ ప్ర‌స్తుత రోజుల్లో ప‌రిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. ప్ర‌భాస్ తో సినిమా సెట్ అయినా కానీ డైరెక్ట‌ర్లు చాలా వ‌ర‌కు సైలెంట్ గా ఉండి వారి ప‌నుల‌ను కొన‌సాగించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

అంచ‌నాలు ఎక్కువ‌గా పెంచ‌కూడ‌ద‌నుకుంటున్నారో లేక బ‌య‌ట‌కు చెప్తే సినిమాకు దిష్టి త‌గులుతుంద‌ని భావిస్తున్నారో కానీ కొంత‌మంది డైరెక్ట‌ర్లు మాత్రం ప్ర‌భాస్ తో క‌థ చెప్ప‌డం నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వ‌ర‌కు ఎలాంటి సౌండ్ లేకుండా వ‌ర్క్ చేస్తున్నారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రాజా సాబ్ ఇలానే మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే.

షూటింగ్ సగానికి పైగా పూర్త‌య్యే వ‌ర‌కు అధికారికంగా ఒక్క‌సారి కూడా సినిమా గురించి అనౌన్స్ చేయ‌క‌పోవ‌డం విశేషం. ఇప్పుడు మారుతిలానే మ‌రో డైరెక్ట‌ర్ కూడా ప్ర‌భాస్ తో సినిమా ప‌నుల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు సీతారామం సినిమా డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి. సీతారామం సినిమా చూసి హ‌ను ప‌నిత‌నాన్ని మెచ్చి, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌భాస్ తో సినిమాను సెట్ చేస్తోంది.

దీనికి సంబంధించిన క‌థ ఎప్పుడో రెడీ అయింది. స్క్రిప్ట్ ప‌నులు కూడా చాలా వ‌ర‌కు పూర్త‌య్యాయ‌ట‌. ప్ర‌భాస్ సినిమాకు ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు దీని గురించి ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే  హ‌ను, ఈ సినిమాను సైలెంట్ గా ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ తో గోవాలో హ‌ను ట్యూన్స్ రెడీ చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎప్ప‌టినుంచో స్టార్ హీరోల సినిమాల‌కు వ‌ర్క్ చేయాల‌ని చూస్తున్న విశాల్ కు కూడా ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఈ సినిమాను ఈ ఏడాది చివ‌ర్లో మొద‌లు పెట్టే అవ‌కాశమున్న‌ట్లు చెప్తున్నారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :