సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. గ్రూప్-1 అభ్యర్థులకు
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనా ఆలస్యమైంది. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగ నియామకాలు చేపడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్టం విధానం ఉంటుంది అని సీఎం తెలిపారు.
Tags :