ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : పస లేని  క్రైమ్ కామెడీ థ్రిల్లర్ "గం..గం..గణేశా"

రివ్యూ : పస లేని  క్రైమ్ కామెడీ థ్రిల్లర్ "గం..గం..గణేశా"

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు.
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు : కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
దర్శకుడు: ఉదయ్ బొమ్మిశెట్టి
విడుదల తేదీ :31.05.2024
నిడివి : 2ఘంటల 20నిముషాలు

ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ‘గం గం గణేశా’, బేబీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత.. అదే ఫ్లో‌ కంటిన్యూ చేయడానికి ‘గం గం గణేషా అంటూ థియేటర్స్‌లో ధూమ్ ధామ్ చేయడానికి నిన్న శుక్రవారం థియేటర్స్‌లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ :

గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఓ అనాధ. తన ఫ్రెండ్ (జబర్దస్త్ ఇమాన్యూయల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అటు శ్రుతి (నయన్ సారిక)తో బాగా డీప్ గా ప్రేమలో ఉంటాడు. ఇద్దరి మధ్య ముద్దు ముచ్చట్లూ రంజుగానే సాగుతుంటాయి. మౌత్ స్ప్రేలు యూజ్ చేసుకుని ముద్దాటలు.. లవ్వాటలు లాగించేస్తుంటారు.  ఐతే,  ఇంతలో శ్రుతికి గణేశ్ కంటే బెటర్ ఛాయిస్ కనిపించడంతో.. తాను పనిచేసే సూపర్ మార్కెట్ ఓనర్‌తో సెట్ అయిపోయి హీరోగార్ని సైడేస్తుంది. దాంతో హీరో గారు హర్ట్ అయిపోతారు. శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్ కి హ్యాండ్ ఇస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో గణేశ్ ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ కోసం గణేశ్ ఏం చేశాడు ?, అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?, మరో వైపు అదే గణేశ్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి ?, అసలు ఆ వంద కోట్లు ఎవరవి ?, ఇంతకీ.. గణేశ్ లైఫ్ లోకి నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ) ఎలా వచ్చింది ?, చివరకు గణేశ్ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు :

ఆనంద్ దేవరకొండ గణేష్ పాత్రలో ఇమిడిపోయాడు. చిల్లర దొంగగా బాగానే నవ్వించాడు. ఇక హీరోయిన్ చేతిలో మోసపోయినా ఈ ‘బేబీ’ బాయ్ లవ్ ట్రాక్‌లో ఫన్‌ని జోడించాడు. హీరోయిన్ నయన్ సారికకి పెద్ద ప్రాధాన్యత లేదు. లిప్ లాక్‌కి సై అని అందనో ఏమో కానీ.. కథకి అవసరం లేకపోయినా లిప్ లాక్‌ సీన్‌ని కావాలనే పెట్టారు. మౌత్ ష్రెష్‌నర్‌లు కొట్టి మరీ.. మన చిన్నకొండబాబుతో గాఢ చుంబనం చేసేసింది ఈ బ్యూటీ. ఇక సెకండ్ హీరోయిన్‌ని కూడా సెకండాఫ్‌లో కథానాయిక ఉండాలి కాబట్టి.. పెట్టినట్టుగా అనిపిస్తుంది. జబర్దస్త్ ఇమ్మానుయేల్‌లో హీరో ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. జబర్దస్త్‌ పంచ్‌లను మిక్స్ కొట్టి.. కామెడీని బాగానే వర్కౌట్ చేశాడు. ఇక సెకండాఫ్‌లో ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిషోర్.. కామెడీ కోసిపారేశాడు. చిప్ దొబ్బిన డాక్టర్‌గా తన పిచ్చి చేష్టలతో నవ్వులు పూయించాడు. రుద్ర విలనిజం‌తో పాటు.. అరుణ్ సుతారియా పాత్రలో ప్రిన్స్ యావర్ కామెడీ పండించాడు. సత్యం రాజేష్ ఫ్యాక్షన్ నేపథ్యంలోని కామెడీ పర్వాలేదు. కిషోర్ రెడ్డిగా రాజ్ అర్జున్ విలనిజం బాగానే పండించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాలో దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. ఆదిత్య జవ్వాది వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

‘‘గం గం గణేశా” అంటూ చక్కని టైటిల్ తో వచ్చిన ఈ క్రైమ్ కామెడీ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. అయితే, ఆనంద్ దేవరకొండ నటన అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు క్లైమాక్స్ బాగున్నా.., కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలోని కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, సినిమా మాత్రం ఎవ్వరికీ  కనెక్ట్ కాదు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :