ASBL NSL Infratech

రివ్యూ : 'గామి' ఓ థ్రిల్లింగ్ జర్నీ

రివ్యూ : 'గామి' ఓ థ్రిల్లింగ్ జర్నీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్, వి సెల్లులోయిడ్, వి ఆర్ గ్లోబల్ మీడియా, క్లౌన్ పిక్చర్స్,  
నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెద్ద,
శాంతి రావు, మయాంక్ పరాక్,  దయానంద్ రెడ్డి, జాన్ కొట్టేలి, శ్రీ ధర, శరత్ కుమార్,
రజనీష్, ఓంకార్ కాటమరాజు, వెంకట్ ఉన్ని కృష్ణన్ తదితరులు....  
సంగీత దర్శకులు: నరేష్ కుమరన్, స్వీకార్ అగస్తి,
సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్ రెడ్డి సి.హెచ్, రాంపి నందిగం,
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్, స్క్రీన్ ప్లే : విద్యాధర్ కాగిత, ప్రత్యుష్ వాత్యం,  
నిర్మాత: కార్తీక్ శబరీష్, శ్వేతా మొరవనేని మరియు క్రౌడ్ ఫండర్స్,
దర్శకుడు: విద్యాధర్ కాగిత
విడుదల తేదీ : 02.03.2024
నిడివి : 2 ఘంటల 26 నిముషములు

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్, కొత్తగా తన కెరీర్‌లో రకరకాల చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామి కథకు ఓకే చెప్పాడట!. కానీ ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు ఇన్నేళ్లు పట్టింది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విద్యాధర్ తో  రీసెంట్ గా ఈ చిత్రం ట్రైలర్ తో టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపి ఈ రోజు  థియేటర్స్ లోకి  వచ్చిన లేటెస్ట్ చిత్రం “గామి”. మరి ప్రేక్షకుడి  అంచనాలు అందుకుందా అనేది సమీక్షలో తెలుసుకుందాం!

కథ :

మానవ స్పర్శని తట్టుకోలేని శంకర్ (విశ్వక్ సేన్) అఘోరా ఆశ్రమంలోనే ఉంటాడు. అతను ఎవరినైనా తాకినా, ఎవరైనా అతడ్ని తాకినా తట్టుకోలేడు. ఒళ్లంతా ఒక రకంగా మారుంది. ఇది మహా దేవుడు అతనికి ఇచ్చిన శాపం అని అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి బయటకు వెళ్లగొట్టేస్తారు. తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఇమడ లేకపోతాడు. అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారకా మాలిపత్రాలు ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే ధ్రువనగిరి ప్రాంతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. అనుకున్నదే తడవు  పరిష్కారం  కోసం  ప్రయాణిస్తుంటాడు. ఈ ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి (చాందినీ చౌదరి) తోడుగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా ద్రోణ పర్వతంలో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాలను పొందాలను ప్రయత్నిస్తారు. దాంతో అతనికి ఉన్న సమస్య పోతుందని శంకర్ ఆ సాహసానికి బయల్దేరుతాడు. అయితే శంకర్‌కు పదే పదే ఓ బాలిక ఉమ (హారిక), సబ్జెక్ట్ సిటీ 333 (మహమ్మద్) వ్యక్తులు కాపాడమని వేడుకుంటున్నట్టుగా.. వారు పదే పదే కనిపిస్తారు? వీరు తనకి ఎందుకు కనిపిస్తారు? అసలు వారితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ ఆ మాలిపత్రాలను పొందుతాడా? శంకర్ తన సమస్య నుంచి బయటపడతాడా? తన సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే క్రమంలో చేసిన సాహసాలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

అఘోర పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా కనిపించాడు. ఎంతో సెటిల్డ్‌గా నటించాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ అనిపించదు. తన స్టైల్‌కు భిన్నంగా నటించి మెప్పించాడు. నటి చాందిని చౌదరి కూడా విశ్వక్ కి డీసెంట్ సపోర్టింగ్ రోల్ కనిపించి తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవడమే కాకుండా కొన్ని కష్టతరమైన సన్నివేశాల్ని చేయడం మెచ్చుకొని తీరాలి.ఇందులో రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా కనిపించదు. ఈ చిత్రానికి ఆమె పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. దేవదాసి దుర్గగా అభినయ మరోసారి తన రోల్ లో షైన్ అయ్యారని చెప్పాలి. ఆమెపై కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. హారిక, మహహ్మద్, దయానంద్, మయాంక్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

దర్శకుడు విద్యాధర్ కాగిత విషయానికి వస్తే.. తాను మంచి పాయింట్ ని తీసుకొని దానిని ఈ రేంజ్ విజువల్స్ తో అందులోని ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రెజెంట్ చేయడం హర్షణీయం. దర్శకుడు మాత్రం ఈ కథను శంకర్ కోణంలోంచి, అతని సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనే దారిలోనే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది.  విశ్వక్ పాత్రని తాను డిజైన్ చేసిన విధానం దానిని ప్రెజెంట్ చేయడం చాలా బాగుంది.  ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేకుండా కూడా తాను ఆడియెన్స్ ని కూర్చోబెట్టగలగడం విశేషం. అయితే తాను కొన్ని అంశాల్లో మాత్రం లాజికల్ గా కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల కథనం స్లోగా నడిపించాడు. ఇవి మినహా తన వర్క్ ఈ చిత్రానికి మెప్పిస్తుంది. ఈ సినిమా ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా టెక్నికల్ టీం అంతటికీ ఆ క్రెడిట్ వెళుతుంది. నరేష్ కుమారన్ ఇచ్చిన సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ రెడ్డి ఇచ్చిన గ్రాండ్ విజువల్స్ బాగున్నాయి. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ కూడా  బాగున్నాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు కోసం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. క్రౌడ్ ఫండింగ్ అంటూ చేసిన ఈ హానెస్ట్ అటెంప్ట్ చాలా తక్కువ బడ్జెట్ లో చూపించిన అవుట్ పుట్ మాత్రం భారీ లెవెల్లో వుంది.

విశ్లేషణ:

గామి కథను చెప్పుకోవడానికి క్లిష్టంగానే ఉంటుంది.. మనకు చూడటానికి మూడు కథల్లా అనిపిస్తుంది. కానీ అసలు మ్యాటర్ ఏంటన్నది చివరగా తెలుస్తుంది. కొంత మంది ఆ ట్విస్ట్ ఏంటి? అసలు జరిగింది ఏంటి? అన్నది ముందే ఊహించేయగలరు. అయితే ఈ గామి అన్నది ఓ జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది.  ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. గామి కథకు ఓ పర్టిక్యులర్ పీరియడ్, ప్లేస్ అంటూ ఏమీ తీసుకోలేదు దర్శకుడు. చూస్తుంటే ఇది 80వ దశకంలో కథ అని  అనుకోవచ్చు. దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ వ్యవస్థను పరోక్షంగా విమర్శించినట్టు చూపించాడు. పార్టులు పార్టులుగా కథను డివైడ్ చేసి చూపించాడు కాబట్టి.. కాస్త ముందుకు వెళ్తాం.. మళ్లీ వెనక్కి వస్తాం. అయితే కథలో మాత్రం ఫ్లో మిస్ అవ్వదు. మూడు కథల్లో నెక్ట్స్ ఏం జరుగుతుందా?  అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ వరకు కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గామి” ఖచ్చితంగా విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి యూనిక్ అండ్ డేరింగ్ అటెంప్ట్ అని చెప్పాలి. ఈ వారం విడుదలైన చిత్రాలలో ఓ థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :