ASBL Koncept Ambience
facebook whatsapp X

ఫిల్మ్ మేకర్ ఆనంద కృష్ణన్, మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు ‘నాన్ వయొలెన్స్’ త్వరలో విడుదల

ఫిల్మ్ మేకర్ ఆనంద కృష్ణన్, మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు ‘నాన్ వయొలెన్స్’ త్వరలో విడుదల

'మెట్రో' ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఎకె పిక్చర్స్ లేఖ నిర్మిస్తున్న చిత్రం "నాన్ వయొలెన్స్". మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యూనిక్ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

సినిమా కథనం 90వ దశకంలో మదురై నగరంలో జరుగుతుంది. దర్శకుడు ఆనంద కృష్ణన్ ఆ కాలంలో మధురై జైలులో జరిగే సంఘటనల చుట్టూ ప్రధానంగా తిరిగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేను రూపొందించారు. 'మెట్రో', 'కొడియిల్ ఒరువన్' చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ఆనంద కృష్ణన్ కు ఈ సినిమా హ్యాట్రిక్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

1990లలో జరిగే కథనం కావడంతో ఆ కాలాన్ని తెరపై యథార్థంగా రిక్రిఎట్ చేయడానికి ప్రొడక్షన్ టీం స్పెషల్ కేర్ తీసుకుంది. ప్రాప్‌లు, వార్డ్‌రోబ్ నుండి షూటింగ్ లొకేషన్‌ల వరకు ప్రతిది ప్రేక్షకులని తిరిగి ఆ కాలానికి తీసుకెళ్ళేలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందిస్తుంది.

మెట్రో శిరీష్, బాబీ సింహా, & యోగి బాబు టైటిల్ క్యారెక్టర్స్‌లో నటిస్తుండగా, అదితి బాలన్, గరుడ రామ్, ఆదిత్య కత్తిర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్, ట్రైల‌ర్ వివ‌రాల‌ను అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :