అమెరికా రహస్యాలను లీక్ చేసింది 21 ఏళ్ల యువకుడు

అమెరికా రక్షణశాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను, యుద్ధ ప్రణాళికలను లీక్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని అమెరికా ఎయిర్ నేషనల్ గార్డ్ జాక్ టెయిక్సిరాగా గుర్తించారు. మసాచుసెట్స్‌లోని నివాసంలో ఉన్న జాక్‌ను ఎఫ్‌బీఐ అధికారులు ముట్టడిరచి అదుపులోకి తీసుకొన్నారు. అతడిపై గూఢచర్యం నేరం మోపారు. అతడిని బోస్టన్‌లోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. 21 ఏళ్ల జాక్ మసాచుసెట్స్ 102 ఎయిర్ నేషనల్ గార్డ్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్నాడు. 2019లో అతడు సర్వీసులో చేరాడు. పశ్చిమ కేప్‌కోడ్‌లోని ఒటిస్ నేషనల్ ఎయిర్‌గార్డ్స్ కార్యాలయంలో సైబర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ జర్నీమన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Tags :