రామ్ ఇక రిస్క్ చేయాల్సిందే!
ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లవుతున్నా రామ్ పోతినేని కెరీర్ పరంగా హిట్టూ ఫ్లాపులను సమానంగా మెయిన్‌టెయిన్ చేస్తూ వెళ్తున్నాడు తప్పించి తన రేంజ్ ను మాత్రం పెంచుకోలేకపోతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తన మార్క్ సినిమాలతో మెప్పించిన రామ్, గత కొన్నేళ్లుగా ఒకే రకమైన ఫార్మాట్ లో సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు.
రామ్ ఇప్పటికీ టైర్-2 హీరోల లిస్ట్ లో ఉండటానికి ప్రధాన కారణం అతను ఎంచుకుంటున్న కథలే. స్టార్ హీరోల్లా మాస్ సినిమలు చేయాలనుకోవడం మంచిదే కానీ ప్రస్తుతం హీరోలంతా కొత్త కథలతో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. సినిమా సినిమాకూ రిస్క్ చేసైనా సరే ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయాలని హీరోలు భావిస్తున్నారు.
కానీ రామ్ మాత్రం తనకు సెట్టయ్యే రెగ్యులర్ స్టోరీలనే చేస్తూ వస్తున్నాడు. మాస్ పంథా కంటిన్యూ చేయడం ఓకే కానీ ఆడియన్స్ మైండ్ సెట్ లాగే తన స్టోరీలను కూడా మార్చుకుంటూ వెళ్తే రామ్ కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లే ఛాన్సుంది. తన తోటి హీరోలంతా కొత్త కథ చెప్పాలని ట్రై చేస్తుంటే రామ్ మాత్రం ఎలాంటి రిస్క్ చేయకుండా సేఫ్ జోన్ లో కంటిన్యూ అవుతున్నాడు.
రామ్ రిస్కీ కథలను ఎంచుకోవడం లేదా లేకపోతే అలాంటి కథలు రామ్ దగ్గరకు రావట్లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రామ్ స్టోరీ సెలెక్షన్ విషయంలో అతని ఫ్యాన్స్ సైతం నిరాశ చెందుతున్నారు. తను ఇప్పటివరకు అటెంప్ట్ చేయని జానర్ లో సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆలోచించకుండా ఇలానే సినిమాలు చేసుకుంటూ పోతే రామ్ కెరీర్ రిస్క్ లో పడటం ఖాయం.