ASBL NSL Infratech

వార్-2... ఎన్టీఆర్‌కు భ‌లే అడ్వాంటేజ్

వార్-2... ఎన్టీఆర్‌కు భ‌లే అడ్వాంటేజ్

చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ హీరోలంద‌రూ బాలీవుడ్ లో త‌మ ల‌క్ ను టెస్ట్ చేసుకున్నారు. కానీ వారికి అక్క‌డ అనుకున్నంత క్రేజ్ రాలేదు. దాని కోసం వారు ఎక్కువ క‌ష్ట‌ప‌డింది కూడా లేదు. ఇప్పుడు మ‌ర్కెట్ బాగా పెరిగిపోయింది కాబ‌ట్టి తెలుగు సినిమాల‌కు, తెలుగు హీరోల‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నార్త్ లో తెలుగు హీరోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది.

ప్ర‌భాస్ సినిమాల‌కు ఉత్త‌రాదిన ఉన్న ప్రేక్ష‌కులు ఓ రేంజ్ లో ఊగిపోతుంటే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కు కూడా అక్క‌డ మంచి ఫాలోయింగే ద‌క్కింది. ఈ ఫాలోయింగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో భాగంగా ఎన్టీఆర్ త‌న త‌ర్వాతి సినిమా దేవ‌ర‌ను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు.

అంతేకాదు, హృతిక్ రోష‌న్ తో క‌లిసి వార్-2 సినిమాలో స్క్రీన్ కూడా షేర్ చేసుకోబోతున్నాడు తార‌క్. ఈ సినిమా కోసం రీసెంట్ గానే ఎన్టీఆర్ ముంబైకు వెళ్లాడు. అయితే హృతిక్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డమంటే మామూలు విష‌యం కాదు. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే బెస్ట్ లుక్స్ ఉన్న హీరోల్లో హృతిక్ ఒక‌డు.

త‌న స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. త‌న లుక్స్ తోనే ఆడియ‌న్స్ ను అరెస్ట్ చేస్తాడు హృతిక్. తార‌క్ కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న‌ప్పటికీ హృతిక్ ముందు లుక్స్ పరంగా త‌న ఉనికిని చాటుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ తార‌క్ కు ఇక్క‌డ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హృతిక్ కంటే తార‌క్ బెస్ట్ పెర్ఫార్మ‌ర్. త‌న న‌ట‌న‌తో ఎన్టీఆర్, హృతిక్ పై ఆధిప‌త్యం చెలాయించ‌గ‌ల‌డు. హిందీ డైలాగ్ డెలివ‌రీ విష‌యంలో కూడా ఈజీగా మార్కులు కొట్టేయ‌గ‌ల‌డు. కాబ‌ట్టి వార్-2 విష‌యంలో ఎలాంటి భ‌యాలు పెట్టుకోన‌క్క‌ర్లేదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :