కాంగ్రెస్ లోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్?
బీఆర్‌ఎస్ నేత, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బొంతు రామ్మోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై ఈ సందర్భంగా చర్చించారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశమివాల్వని కోరారు. ముందు చేరండి, పార్టీ పరిశీలిస్తుందని సీఎం చెప్పారని రామ్మోహన్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags :