ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
ప్రముఖ బిలినియర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంగారక గ్రహం (మార్స్)పైకి 10 లక్షల మంది ప్రజలను తీసుకెళ్తామని, ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అంగారకుడిపై నివసించేందుకు చాలా పనిచేయాల్సి ఉందన్నారు. స్టార్ షిప్ అతిపెద్ద రాకెట్ ఇది. ఇది మనల్ని మార్స్ వద్దకు తీసుకెళ్తుంది అంటూ ఒక యూజర్ చేసిన పోస్టుకు మస్క్ స్పందించారు. అంగారకుడిపైకి వెళ్లే స్టార్‌షిప్‌ను ఎప్పుడు ప్రయోగిస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినట్టుగా ఒక రోజున మార్స్‌కు కూడా ట్రిప్ ఉంటుంది అని పేర్కొన్నారు.
Tags :