‘డంకీ డ్రాప్ 5’గా ‘ఓ మాహీ..’ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్.. ఈ ఏడాదిని మ్యూజికల్ ట్రీట్‌తో విజయవంతంగా పూర్తి చేస్తున్న ‘డంకీ’
షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. డిసెంబర్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘ఓ మాహీ..’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో కింగ్ ఖాన్ షారూక్, తాప్సీ కలిసి ఎలాంటి అవధులు లేని వారి నిస్వార్థమైన ప్రేమతో మనల్ని ప్రేమ ప్రయాణంలో ముంచెత్తుతారు.
ఇటీవల ‘డంకీ డ్రాప్ 4’ అంటూ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రాజ్‌కుమార్ హిరాని ఓ అందమైన ప్రపంచాన్ని ఎలా ఉంటుందనే విషయాన్ని చూశారు. హిందీ సినిమా చరిత్రలో 24 గంటల వ్యవధితో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా ఇది కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సిినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లేలా డంకీ డ్రాప్ 5ను విడుదల చేశారు. ‘ఓ మాహీ..’ అంటూ సాగే ఈ ప్రమోషనల్ సాంగ్‌లోయ హార్డి, మనులుగా షారూక్, తాప్సీ హద్దుల్లేని, నిస్వార్థమైన ప్రేమను, సింఫనీని ఆవిష్కరించారు. ఇదొక మెలోడియస్ సాంగ్.. ఇందులో వారిద్దరూ స్వచ్చమైన ప్రేమను చూపించారు. ఇంత గాఢమైన ప్రేమలో జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. వారి ప్రేమలోని అందం, ఓ ఆత్మగా మారి చక్కటి రాగంలో శ్రోతలను ఆకట్టుకుంది.
‘ఓ మాహీ..’ సాంగ్‌ను మ్యూజికల్ మ్యాస్ట్రో ప్రీతమ్ కంపోజ్ చేశారు. ఇర్షాద్ కమిల్ రాసిన ఈ పాటను అర్జిత్ సింగ్ అద్భుతంగా ఆలపించారు. వైభవ్ మర్చంట్ ఈ పాటకు తగ్గట్లు చక్కటి నృత్య రీతులను సమకూర్చారు. ఇది కచ్చితంగా విజువల్, మ్యూజికల్ ట్రీట్ అవుతుందనటంలో సందేహం లేదు.
‘ఓ మాహీ..’ సాంగ్ ఏడారి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. హార్డి, మను మధ్య ఉండే శాశ్వతమైన ప్రేమకు గుర్తుగావారి ప్రయాణంలో అంర్లీనంగా ఉండే పోరాటాలను ఇది చక్కగా ప్రతిబింబిస్తుంది. చక్కటి సాహిత్యం, శ్రావ్యమైన గొంతు, ఆకట్టుకునే విజువల్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. ఇది ఆడియెన్స్‌కి మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది.
డంకీ డ్రాప్ అంటూ వీడియోలు, పాటలను మేకర్స్ ప్రేక్షకులకు అందించారు. అందులో ముందు షారూక్ బర్త్ డే సందర్భంగా డంకీ డ్రాప్ 1 అంటూ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అర్జిత్ సింగ్ పాడిన ‘లుట్ పుట్ గయా..’ చక్కటి పాటను డంకీ డ్రాప్ 2గా రిలీజ్ చేశారు. ఇక డంకీ డ్రాప్ 3లో సోనూ నిగమ్ పాడిన ‘నికలే ది హమ్ ఘర్ సే’ పాటను విడుదల చేశారు. డంకీ డ్రాప్ 4గా ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు డంకీ డ్రాప్ 5 అంటూ హృదయాలను సున్నితంగా హత్తుకునే ‘ఓ మాహీ..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
https://x.com/iamsrk/status/1734178675971772440?s=46&t=PusltWkTns46RNMqjWxAeA