‘డంకీ’ చిత్రం నుంచి ‘డంకీ డ్రాప్ 3’గా ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ అనే మెలోడి సాంగ్ విడుదల
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రతి రోజు ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతున్న మూవీ కంటెంట్ అంచనాలను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే ‘డంకీ డ్రాప్ 2’ అంటూ ‘లుట్ పుట్ గయా..’ సాంగ్‌ను మేకర్స్ విడుల చేసిన సంగతి తెలిసిందే. ప్రీతమ్ సంగీత సారథ్యంలో ఈ సాంగ్‌ను సోనూ నిగమ్ అద్భుతంగా పాడారు. దీంతో పాటు డంకీ డ్రాప్ 1 అంటూ ఓ వీడియోను కూడా అంత కంటే ముందుగానే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీటిని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించారు. షారూక్, సోనూ నిగమ్ కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్ సాంగ్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డంకీ కోసం వీరిద్దరూ మరోసారి ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ సాంగ్‌తో మ్యాజిక్‌ను క్రియేట్ చేశారు.
ఈరోజు విడుదల చేసిన డంకీ డ్రాప్ 3లోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ సాంగ్ సినిమాలో ఎమోషనల్ పార్ట్ లో మరో హృద్యమైన పొరను అదనంగా జోడించింది. నలుగురు స్నేహితులు విదేశాలకు వెళ్లాలని తాపత్రయ పడతారు. వారి భావోద్వేగ ప్రయాణంలో ఉండే ఆరాటాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటలో భవిష్యత్తులో బావుండాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉంటుంటారు. అలాంటి వారు తమ మాతృదేశానికి దూరమై దానిపై చూపించే ప్రేమను ఈ పాట వెల్లడి చేస్తుంది.
కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రాజ్ కుమార్ హిరాణి.. ‘డంకీ’ సినిమాను హృద్యంగా తెరకెక్కించారు. ఇది ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాలను ఆవిష్కరించే చిత్రం. సినిమాలో పాత్రలు ఎదుర్కొనే సమస్యలను నవ్వు తెప్పించేలా చూపిస్తూనే గుండె పొరలను తాకేంత భావోద్వేగంతో నిండి ఉండేలా ఆవిష్కరించారు. హర్డీ, మను, బగ్గు, బల్లి అనే స్నేహితులు వారి జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారికి ఇల్లు, తమకిష్టమైన వారిని చూడాలనే కోరిక ఎలా ఉంటుందనే విషయాన్ని వివరించారు.
‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ పాటతో మనకు కావాల్సిన వారికి దూరంగా ఉన్నప్పుడు మనసులో ఉండే వేదను పాట రూపంలో చెప్పే ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. హద్దులు దాటి హృదయాలను కలుపుతూ, కలలను నిజం చేసుకోవడానికి సాహసించే వారి చేదు తీపి ప్రయాణాన్ని ఈ పాట తెలియజేస్తుంది.
'డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.