ASBL NSL Infratech

నెక్ట్స్ లెవెల్ లో మీనాక్షి క్రేజ్

నెక్ట్స్ లెవెల్ లో మీనాక్షి క్రేజ్

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన మీనాక్షి చౌద‌రి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. గుంటూరు కారం సినిమాలో మ‌హేష్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మీనాక్షికి ఆ సినిమా త‌ర్వాత అవ‌కాశాలు క్యూ కట్టాయి. గుంటూరు కారంలో అమ్మ‌డి పాత్ర చిన్న‌దే అయినా ఆ లెక్క వేరేలా ఉంటుంద‌ని మీనాక్షి ప్రూవ్ చేసింది.

ఇప్ప‌టికే త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న గోట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి. విజ‌య్ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ ఆఫ‌ర్ అంటే మామూలు విష‌యం కాదు. ఈ సినిమాతో పాటూ తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ స‌ర‌స‌న ల‌క్కీ భాస్క‌ర్, వ‌రుణ్ తేజ్ తో మ‌ట్కా, విశ్వ‌క్సేన్ హీరోగా వ‌స్తున్న మెకానిక్ రాకీ సినిమాల్లోనూ న‌టిస్తోంది అమ్మ‌డు.

విజ‌య్ గోట్ సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ చాలా బ‌లంగా ఉంటుంద‌ని, ఆ పాత్ర కోసం తాను బాక్సింగ్ కూడా నేర్చుకున్న‌ట్లు మీనాక్షి రీసెంట్ గా తెలిపింది. ఏద‌మైనా యంగ్ హీరోయిన్స్ లో చిన్నగా త‌న మార్క్ ను చాటిచెప్తూ ఆడియ‌న్స్ లో క్రేజ్ పెంచుకుంటుంది మీనాక్షి. ప్ర‌స్తుతం మీనాక్షి హీరోయిన్ గా న‌టిస్తున్న సినిమాల‌న్నీ త‌న రేంజ్ ను పెంచే సినిమాలనే చెప్పాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :