అమెరికా చరిత్రలోనే ఆయన అత్యంత అవినీతిపరుడు : ట్రంప్

జో బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గు చేటైన విషయంగా అభివర్ణించారు.
Tags :