MKOne Telugu Times Business Excellence Awards

నిర్దోషి టీ షర్ట్ లతో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం

నిర్దోషి టీ షర్ట్ లతో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం

న్యూయార్క్‌ కోర్టు తనపై మోపిన నేరాభియోగాలనూ అనుకూలంగా ములుచుకునేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. విచారణ  సందర్భంగా భద్రత ఇతర కారణాల రీత్యా ఆయనను నిందితుడిగా చూపేలా ఉండే ఫొటోలను పోలీసులు తీయలేదు. కానీ అంతకుముందే ఆయన నిర్దోషి (నాట్‌ గిల్టీ) అని రాసి ఉన్న టీ షర్ట్‌ ధరించి ఫొటో (మగ్‌షాట్‌) దిగారు. దానిని ప్రచారంలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇక నుంచీ నిర్దోషి అని రాసి ఉన్న టీ షర్ట్‌లను ప్రచారంలో భాగంగా మద్దతుదారులకు  పంచాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త ఐటం మగ్‌ షాట్‌ పేరుతో ఈ మెయిల్‌ పంపారు.  ట్రంప్‌కు మద్దతుగా నిలవాలనుకునేవారు 47డాలర్లను పంపాలని, టీ షర్ట్‌ను ఉచితంగా పంపుతామని అందులో పేర్కొన్నారు.

 

 

Tags :