ASBL Koncept Ambience
facebook whatsapp X

'కలియుగ పట్టణంలో' సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు మదర్ సెంటిమెంట్ తో మెప్పిస్తుంది - డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి

'కలియుగ పట్టణంలో' సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు మదర్ సెంటిమెంట్ తో మెప్పిస్తుంది - డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ అంది. ఈ క్రమంలో దర్శకుడు రమాకాంత్ రెడ్డి నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. 

*కలియుగం పట్టణంలో అంటే ఊరిపేరా? టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?*

ఊరిపేరు కాదు. మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి అనే కథ ఇది. ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాము. 

*టైటిల్‌లో మస్కిటో కాయిల్స్, రెంచ్ ఉన్నాయి. కలియుగాన్ని ఏమన్నా రిపేర్ చేయబోతున్నారా?*         

లేదండి. వాటికి సినిమాలో కథకి లింక్ ఉంటుంది. వాటితో స్టోరీ నడుస్తుంది. అందుకే పెట్టాము.    

*నంద్యాల బ్యాక్ డ్రాప్ లో తీసుకోడానికి రీజన్ ఏంటి?*

నంద్యాల దగ్గర్లోనే నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. కథలో ఫారెస్ట్ కి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది. అందుకే నంద్యాలలో చేసాము.

*మీ సినిమా ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తుంది, మీ సినిమాలో ఇంకా ఏమేం పాయింట్స్ ఉన్నాయి? మీ సినిమా స్పెషల్ ఏంటి?*      

ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఉంటుంది. దాంతో పాటు లవ్, యాక్షన్, ఒక మెసేజ్ కూడా ఉంటుంది.

*హీరోని మెంటల్ హాస్పిటల్‌లో చూపించారు ట్రైలర్‌లో అసలు క్యారెక్టర్ ఏంటి?*  

హీరో మెంటల్ హాస్పిటల్ లో ఉన్న దగ్గర్నుంచే కథ మొదలవుతుంది. దాన్ని తెరపై చూస్తే బాగుంటుంది. 

*అమ్మ సెంటిమెంట్‌తో పాటు నాన్న మీద కోపం కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ఉంది, ఎందుకు?*  

బయట చాలామంది తండ్రులు సోషియో ఫోబియాతో ఉన్నారు. నా కొడుకు ఇలా ఉండాలి, ఇది చేయాలి, సమాజం ఏం అంటుందో అనే ఆలోచిస్తారు. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు. వాటికి తగ్గట్టు కథలో ఆ పాయింట్ కూడా ఉంటుంది. 

*ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసుకొని చేశారా?*    

బయట ఇలాంటివి చాలా చూస్తున్నాము. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ ప్రగ్నెంట్ లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది. నేను ప్రగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదు అని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతుంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నాను. 

*ఇది మీ మొదటి సినిమా, సినిమాల్లోకి ఎలా వచ్చారు, మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?*

నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమా తీశారు. అప్పుడు షూటింగ్ లో నేను అసిస్టెంట్ గా పనిచేసాను. అక్కడ్నుంచి సినిమా ఇంట్రెస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్ లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని సినిమాలకు పనిచేసాను. కరోనాలో ఫిక్స్ అయి కరోనా తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. కోడి రామకృష్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేసాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేసాను. 

*హీరోగా విశ్వ కార్తికేయనే ఎందుకు తీసుకున్నారు? గత సినిమాలకు, ఈ సినిమాకి విశ్వ నటనలో చేంజ్ ఏముంది?*

ముందు ఒకటి రెండు సినిమాలు చేసిన కొంతమంది హీరోలను అప్రోచ్ అయ్యాను. అయితే ఇందులోని ఇంటెన్స్ క్యారెక్టర్ ని వాళ్ళు చెయ్యలేమన్నారు. అప్పుడు విశ్వ ప్రొఫైల్ వచ్చింది. స్టోరీ విన్నాక ధైర్యంగా చేస్తా అని చెప్పాడు. నాకు కూడా అతనిలో ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది.  గత సినిమాల్లో చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు. ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా విశ్వ కెరీర్ లో ఒక మార్క్ గా నిలిచిపోతుంది. ఈ సినిమా తర్వాత కలియుగం కార్తికేయ అని పిలుస్తారు. 

*ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి చెప్పండి..* 
      
సినిమాలో ఆయుషి పటేల్ హీరోయిన్. కొత్తమ్మాయి, తెలుగమ్మాయి. గ్లామర్ పరంగా కాకుండా సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకో హీరోయిన్ చిత్రశుక్ల కూడా ఉంది. పోలీస్ రోల్ లో కనిపిస్తుంది. 

*ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలు ఉన్నారు, మీ మొదటి సినిమాకి ముగ్గుర్ని ఎలా ఒప్పించారు?*

నిర్మాతలకి ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒక ప్రొడ్యూసర్ మా కజిన్ మహేష్ . నేను ఇలా సినిమాల్లో తిరుగుతున్నప్పుడు అతన్ని కలిసి కథ చెప్పి ఇలా చేయాలనుకుంటున్నాను అంటే కథ నచ్చి మనమే చేద్దాం అన్నాడు. ఒక్కరే అయితే నిర్మాతగా కష్టం అని ఆ తర్వాత కథ నచ్చి ఓబుల్ రెడ్డి గారు, రమేష్  గారు తోడయ్యారు. ఓబుల్ రెడ్డి గారికి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయన కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారు. 

*ఇందులో కాలేజీ స్టూడెంట్స్ కి మెసేజ్ ఉంది అని తెలిసింది?*

ఇందులో మంచి మెసేజ్ ఉంది. కాలేజీ స్టూడెంట్స్ దానికి అట్రాక్ట్ అవుతారు. అలా చేయొద్దు, అటు వైపు వెళ్లొద్దు అనే మెసేజ్ ఉంటుంది. నిర్మాత ఓబుల్ రెడ్డి గారు మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కాలేజీలో షూట్, కడపలో షూట్ చేయమన్నారు. అక్కడ కాలేజీ పిల్లలు కూడా ఈ సినిమా చూడాలి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ రంగంలోకి రావడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా ఈ మెసేజ్ తెలుసుకోవాలి అని షూట్ అక్కడే చేయించారు. కడపలో 39 రోజులు షూట్ చేసాము రెండు షెడ్యూల్స్ లో, ఇంకో షెడ్యూల్ 10 రోజులు హైదరాబాద్ లో చేసాము. టైటిల్, ట్రైలర్ లాంచ్ కూడా కడపలోనే చేసాము నిర్మాత గారు అక్కడ చేద్దాం అనడంతో. మిగిలిన ప్రమోషన్స్ ఇక్కడ చేస్తాము.           

*ఈ సినిమాని ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు చూపించారు, వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఏమన్నారు?*

అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మొదటి సినిమానే బాగా చేసావు, డేరింగ్ గా చేసావు అన్నారు. DVS రావు గారు, వాసు గారు.. పలువురు పెద్దలు అభినందించారు సినిమా చూసి.

*ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పండి..*

ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. ఒకటి మదర్ సాంగ్, ఒకటి లవ్ సాంగ్, ఒకటి ఐటెం సాంగ్, టైటిల్ సాంగ్ ఉన్నాయి. రెండు పాటలు భాస్కరభట్ల గారు రాసారు. టైటిల్ సాంగ్, ఐటెం సాంగ్ చంద్రబోస్ గారు రాసారు. 

*థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి, సినిమాకు ఎలా మ్యూజిక్ ఇచ్చారో చెప్పండి?*

ఈ సినిమాకి అజయ్ అరసాద మ్యూజిక్ ఇచ్చాడు. కొత్తవాడైనా మంచి సంగీతం ఇచ్చాడు. గూడాచారి సినిమాకు కీబోర్డు ప్లేయర్ గా పనిచేసాడు. నాకు అతని వర్క్ నచ్చింది. అతను ఆల్రెడీ సేవ్ ది టైగర్స్, ఓ మూడు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి కూడా మంచి అవుట్ పుట్ అందించాడు. 

*మీ మొదటి సినిమానే ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది?*

నాకు చాలా హ్యాపీగా ఉంది అంత పెద్ద సంస్థ మా సినిమాని రిలీజ్ చేయడం. మేము వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కథ నచ్చింది. దాంతో చిన్న సినిమాలకు మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అందుకు అన్నపూర్ణ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.   

*డైరెక్టర్ గా మొదటి సినిమానే ఇలా మెసేజ్, థ్రిల్లర్ తీసుకోడానికి కారణం ఏంటి?*

ఏది తీసినా ఆడియన్స్ ఒప్పుకోకపోతే డైరెక్టర్ సక్సెస్ అవ్వడు. మాస్, థ్రిల్లర్, లవ్.. ఏ జానర్ తీసినా ప్రేక్షకులని మెప్పించాలి. 

*సినిమా విజువల్స్, కెమెరామెన్ గురించి చెప్పండి?*

చరణ్ మాధవనేని కెమెరామెన్ గా వర్క్ చేశారు. చెప్పింది అర్ధం చేసుకొని, చాలా సపోర్ట్ ఇచ్చి చాలా బాగా వర్క్ చేసారు. మంచి విజువల్స్ వచ్చాయి. 

*నెక్స్ట్ సినిమాలు ఏమైనా మొదలుపెడుతున్నారా?*

దీనికే సీక్వెల్ కలియుగ నగరంలో అని తీస్తున్నాను.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :