రిస్కీ రోల్ కు రకుల్ ఒప్పుకుంటుందా?
ఒకప్పుడు టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ అనుభవించిన స్టార్‌డమ్ వేరు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టిన రకుల్ ఇప్పుడు తెలుగు సినిమాలను తగ్గించేసింది. ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టిన రకుల్ రీసెంట్ గా శివ కార్తికేయన్ కు జోడీగా అయలాన్ లో నటించింది. ఇదిలా ఉంటే రకుల్ కు ఓ పాన్ ఇండియా సినిమాలో రిస్కీ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణంను మూడు భాగాలుగా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ క్యాస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు క్యారెక్టర్లు ఫిక్స్ అయ్యాయి. రాముడిగా రన్‌బీర్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. సీత పాత్రలో సాయి పల్లవి చేస్తుందా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ చేయనున్నాడు. రావణుడిగా యష్ చేస్తాడా లేదా అనేది అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు చెప్పలేం. లారా దత్త కైకేయిగా, విజయ్ సేతుపతి విభీషణుడిగా కనిపించనున్నారు. ఈ క్రమంలో రకుల్ ను శూర్పణఖ క్యారెక్టర్ కోసం అడిగినట్లు ముంబై మీడియా వర్గాలు చెప్తున్నాయి. చాలా మంది శూర్పణఖను రాక్షసిగా అంటారు కానీ వాస్తవానికి ఆమె చాలా అందగత్తె కాబట్టే లక్ష్మణుడు ఆవిడ ముక్కు, చెవులు కోసేస్తాడని చాలా బుక్స్ లో ఉంటుంది. నితేష్ ఈ అంశాన్నే తెరపై హ్యాండిల్ చేయాలని చూస్తున్నాడట. క్యారెక్టర్ లో పెద్దగా నెగిటివిటీ ఉండదనుకుంటే రకుల్ ఈ క్యారెక్టర్ కు ఓకే చెప్పే ఛాన్సుంది. పాత్రల ఎంపిక మొత్తం పూర్తయ్యాక మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.