ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎయిర్ ఇండియాకు షాక్.. రూ.30 లక్షల జరిమానా

ఎయిర్ ఇండియాకు షాక్.. రూ.30 లక్షల జరిమానా

వీల్‌చైర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటన ముంబయి విమానాశ్రయంలో ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఎయిరిండియాపై చర్యలు తీసుకుంది. విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అమెరికా నుంచి ఎయిరిండియా విమానంలో భారత్‌కు వచ్చిన వృద్ధ దంపతులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 12న దిగారు సిబ్బంది వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఆ వృద్ధుడు (80) విమానం నుంచి టెర్నినల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. ఇమిగ్రేషన్‌ విభాగం వద్దకు చేరుకున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎయిరిండియా వివరణ ఇచ్చింది.  వీల్‌ఛైర్లకు భారీ డిమాండు ఉన్నందున మరొకటి సమకూర్చేవరకు కొద్దిసేపు వేచి ఉండాలని వారిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. వీల్‌చైర్‌ సమకూర్చడంలో విమానయాన సంస్థ అలసత్వం వహించిందని తేల్చింది. ఇందుకు రూ.30 లక్షల జరిమానా విధించింది. వీల్‌చైర్లను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ చేసింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :