ASBL NSL Infratech

టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ కానున్న దేవ‌ర‌

టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ కానున్న దేవ‌ర‌

ఆర్ఆర్ఆర్ హిట్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, త‌న త‌ర్వాతి సినిమాను కొర‌టాల శివ‌తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కానుంది. జాన్వీ క‌పూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం కొరటాల ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు. దేవ‌ర కోసం ప్రాణం పెడుతున్న కొర‌టాల త‌న కెరీర్ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వ‌నున్నాడ‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు. సినిమా నుంచి ఇప్పటివ‌ర‌కు రిలీజైన పోస్ట‌ర్స్, గ్లింప్స్, ఫ‌స్ట్ సాంగ్ దేవ‌ర‌పై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ పూర్తైన‌ట్లు తెలుస్తోంది.

రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ను నెట్స్ ఫ్లిక్స్, ఆడియో రైట్స్ ను టీ సిరీస్, శాటిలైట్ హ‌క్కుల‌ను స్టార్ మా సొంతం చేసుకుంది. థియేట్రిక‌ల్ గా కూడా దేవ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని స‌మాచారం. ఓవ‌ర్సీస్ లో రూ.27 కోట్లకు డీల్ జ‌రిగింద‌ట‌. నాన్ తెలుగు లాంగ్వేజెస్‌పై రూ.70 కోట్ల బిజినెస్ అయిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.207 కోట్ల మేర జ‌రిగింది. థియేట్రిక‌ల్, నాన్ థియేట్రిక‌ల్ క‌లుపుకుంటే దేవ‌ర టేబుల్ ప్రాఫిట్ తోనే రిలీజ్ కానుంద‌ని అర్థ‌మ‌వుతుంది. మంచి టాక్ వ‌స్తే లాభాలు ఓ రేంజ్ లో ఉండ‌టం ఖాయం.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :