ASBL NSL Infratech

దేవ‌ర కొత్త రిలీజ్ డేట్.. భార‌మంతా అనిరుధ్ పైనే!

దేవ‌ర కొత్త రిలీజ్ డేట్.. భార‌మంతా అనిరుధ్ పైనే!

సౌత్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిరుద్ ర‌విచంద‌ర్. చేతిలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న అనిరుద్ చేతిలో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న దేవ‌ర కూడా ఒక‌టి. ఈ సినిమాకు అనిరుద్ తో సంగీతం ఇప్పించుకోవ‌డం కొర‌టాల వ‌ల్ల కావ‌డం లేదు.

వాస్త‌వానికి దేవ‌ర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు వాయిదా ప‌డిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. టీమ్ అధికారికంగా అనౌన్స్ చేయ‌లేదు కానీ మిగ‌తా నిర్మాత‌లు దేవ‌ర వాయిదా ప‌డుతుంద‌ని త‌మ సినిమాల‌ను రిలీజ్ చేయ‌డం చూస్తుంటే క‌న్ఫ‌ర్మ్ అని అర్థ‌మైపోతుంది. దేవ‌ర వాయిదా ప‌డ‌టానికి కార‌ణం సైఫ్ అలీ ఖాన్ ప్ర‌మాదానికి గురి కావ‌డం కూడా ఒక కార‌ణం.

కానీ ప్ర‌ధాన స‌మస్య మాత్రం సైఫ్ కు జ‌రిగిన స‌ర్జ‌రీ కాదు. దేవ‌ర సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు అనిరుధ్ ఎన్ని సాంగ్స్ ఇచ్చాడ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు తెలియదు. దేవ‌ర సినిమా మొద‌లైన కొత్త‌లో డైరెక్ట‌ర్ కొర‌టాల శివతో పాటూ డిస్క‌ష‌న్స్ లో పాల్గొన్న అనిరుధ్ ఆ త‌ర్వాత ఈ టీమ్ తో క‌లిసి క‌నిపించింది లేదు. సాంగ్స్ రెడీ చేసి ఉంటే కొర‌టాల ఇప్పటికే సాంగ్స్ ను షూట్ చేసేవాడు కానీ అది జ‌ర‌గ‌లేదు. కాబ‌ట్టి ఇప్పుడైనా అనిరుధ్ ఎప్ప‌టిలోపు సినిమాకు సాంగ్స్, రీ రికార్డింగ్ పూర్తి చేయ‌గ‌ల‌డ‌నేది క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న త‌ర్వాతే దేవ‌ర కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తే బావుంటుంద‌నే ఉద్దేశంలోనే టీమ్ ఉంద‌ట‌. అనిరుధ్ ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు దేవ‌ర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌డం క‌ష్ట‌మే.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :